టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఓటీటీ వైపు అడుగులెేస్తున్నాడు. అతడు నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ ప్లెక్స్‌లో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. పే పర్ వ్యూ పద్ధతిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకు రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించాడు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. నభా నటేష్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు.
ఇదీ చూడండి 'జేమ్స్ బాండ్' అభిమానులకు మరోసారి నిరాశ