ETV Bharat / sitara

'వివాహ భోజనంబు' పెళ్లి పాట.. 'క్యాబ్​ స్టోరీస్​' టీజర్

author img

By

Published : May 20, 2021, 7:03 PM IST

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'వివాహ భోజనంబు' లిరికల్​ సాంగ్​తో పాటు 'క్యాబ్​ స్టోరీస్​-1' టీజర్​ అప్​డేట్లు ఇందులో ఉన్నాయి.

Social Media updates
'వివాహ భోజనంబు' పెళ్లి పాట.. 'క్యాబ్​ స్టోరీస్​' టీజర్

తెలుగు చిత్రాల్లో పెళ్లి పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఇప్ప‌టికే ఎన్నో పెళ్లి గీతాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోగా ఇప్పుడు మ‌రో గీతం సంద‌డి చేస్తోంది. అదే 'వివాహ భోజ‌నంబు' చిత్రంలోని 'దేవీ కల్యాణ వైభోగ‌మే'. హాస్యన‌టుడు స‌త్య హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. అర్జావీరాజ్ నాయిక‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ పాట‌ను విడుద‌ల చేసింది చిత్రబృందం.

Social Media updates
'వివాహ భోజనంబు' పెళ్లి పాట

కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించిన ఈ పాట‌ను ఆంటోనీ దాస‌న్‌, చిన్మయి ఆల‌పించారు. అనివీ సంగీతం అందించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడి క‌థ ఇది. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ స్వీయ నిర్మాణంలో అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, వైవా హ‌ర్ష త‌దిత‌రులు కీల‌కపాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆల‌స్య‌మెందుకు సత్య‌, అర్జావీ వివాహ వేడుక‌ను మీరూ తిల‌కించండి..

Social Media updates
'క్యాబ్​ స్టోరీస్​' టీజర్

బిగ్​బాస్​ కంటస్టెంట్​ దివి హీరోయిన్​గా పరిచయమవుతున్న చిత్రం 'క్యాబ్​​ స్టోరీస్​-1'. ఈ సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది. ప్రముఖ నటులు సునీల్​, వెన్నెల కిషోర్​, శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా టీజర్​ను రిలీజ్​ చేశారు. మే 28న స్పార్క్​ ఓటీటీలో విడుదల కానుంది.

ఇదీ చూడండి.. క్యారవాన్​​ డ్రైవర్​ కుటుంబానికి మెగాస్టార్​ సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.