ETV Bharat / sitara

సినిమా టికెట్ ధరల గురించి అలా మాట్లాడలేదు: త్రివిక్రమ్ - trivikram mahesh babu movie

సినిమా టికెట్​ల గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. తనకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతాలు లేవని చెప్పారు.

director trivikram
డైరెక్టర్ త్రివిక్రమ్
author img

By

Published : Nov 27, 2021, 12:10 PM IST

సినిమా టికెట్ ధరల విషయంలో తన పేరును ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యాలపై ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సామాజిక మాద్యమాల్లో ఎలాంటి ఖాతాలు లేవని, హారికా హాసినీ, ఫార్చున్ ఫర్ సినిమాస్ పేరుతో ఉండే ట్విట్టర్ ఖాతాల ద్వారా మాత్రమే అధికారికంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.

తన పేరుతో సినిమా టికెట్ ధరలపై వచ్చిన అభిప్రాయాలను నమ్మవద్దని మంత్రి పేర్నినానితోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఏపీ సమాచార ప్రసార శాఖను కోరారు. ప్రతి పాఠశాలలో ఒకటే ఫీజు, ప్రతి ఆస్పత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు, పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో చేసిన ట్వీట్​ చేశారు.

దీనిని పరిగణలోకి తీసుకున్న మంత్రి పేర్ని నాని.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తన పేరుతో వచ్చిన ట్వీట్ వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు త్రివిక్రమ్.. హారికా హాసినీ క్రియేషన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఖండించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.