టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు కుమార్తె సితార సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటుంది. తన డ్యాన్స్ వీడియోలు, ఫొటోలతో నెటిజన్లకు దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఓ సినిమాలో పాత్రకు తన గొంతు అందించేందుకు సిద్ధమైంది. ఓ హాలీవుడ్ సినిమా తెలుగు వెర్షన్ కోసం డబ్బింగ్ చెప్పనుంది.
డిస్నీ పిక్చర్స్ రూపొందించిన 'ఫ్రోజెన్ 2'లోని బేబీ ఎల్సా పాత్రకు తెలుగులో సితార డబ్బింగ్ చెప్పనుంది. ఇప్పటికే ఎల్సా పాత్రకు నిత్యామేనన్, ఒలఫ్ పాత్రకు ప్రియదర్శి గాత్రం అందిస్తున్నారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇవీ చూడండి.. ఆయనతో సావాసం అంటే ఇలానే ఉంటది..