ETV Bharat / sitara

Singer Sunitha: సింగర్​ సునీత.. తన భర్తతో కలిసి! - Singer Sunitha film maker

ప్రముఖ సింగర్ సునీత కొత్త బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తన భర్తతో కలిసి వెబ్ సిరీస్​ నిర్మాణంలో పాలుపంచుకోనున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

sunitha
సునీత
author img

By

Published : Jun 30, 2021, 1:22 PM IST

Updated : Jun 30, 2021, 3:33 PM IST

ఇప్పటివరకు తన పాటలతో అలరిస్తున్న ప్రముఖ సింగర్ సునీత త్వరలో నిర్మాతగా మారనుందా? అంటే అవుననే సినీ వర్గాలు అంటున్నాయి. బిజినెస్​మ్యాన్ రామ్​ వీరపనేనిని ఇటీవల వివాహం చేసుకున్న ఈమె.. త్వరలో ఆయనతో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మ్యాంగో సంస్థల అధినేత రామ్.. 'ఏక్​మినీ కథ' సినిమాతో నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. త్వరలోనే ఓ వెబ్​సిరీస్​ను రూపొందించాలని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన బాధ్యతల్ని సునీత స్వయంగా పర్యవేక్షించనున్నారట.

సునీత తెలుగులో ఎన్నో హిట్​పాటలు పాడి శ్రోతల మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు. ప్లేబ్యాక్​ సింగర్​గానే కాకుండానే యాంకర్​గా, డబ్బింగ్​ ఆర్టిస్ట్​గా తెలుగు ప్రేక్షకులను అలరించారు. సౌందర్య, స్నేహ, సోనాలి బింద్రే, కమలినీ ముఖర్జీ, జెనీలియా, ఇలియానా, త్రిష, కత్రినా కైఫ్​లతో పాటు ఇంకా చాలామంది స్టార్ల హీరోయిన్లకు డబ్బింగ్​ కూడా చెప్పారు.

ఇదీ చూడండి: Sunitha: కాలేజీలో మామూలు ఫాలోయింగ్​ లేదు!

Last Updated : Jun 30, 2021, 3:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.