స్నేహితులు, బంధువులను వివాహ అనంతర పార్టీ(పోస్ట్ వెడ్డింగ్ మీట్)కి ఆహ్వానించి ఓ ఆసక్తికరమైన సన్నివేశాన్ని నెమరు వేసుకున్నాడు ప్రముఖ సింగర్ రాహుల్ వైద్య. తన శోభనానికి ఎలాంటి ఆటంకం ఎదురైందో చెప్పుకొచ్చాడు. ఇటీవలే నటి దిశా పర్మర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు రాహుల్.
ముంబయిలోని గ్రాండ్ హయత్ హోటల్లో ఈ జంట పోస్ట్ వెడ్డింగ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ మైక్ తీసుకుని తన మామ వల్లే తమ శోభనానికి భంగం కలిగిందని చెప్పుకొచ్చాడు. పక్కనే నిల్చుని ఉన్న అతడి సతీమణి దిశా నవ్వుతూనే ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"ఉదయం 8 గంటల నుంచి మా మామయ్య శోభనం గదిలోనే ఉన్నారు. పార్టీ జరుగుతున్న సమయంలో.. సోదరులు శ్రేయస్, అర్పిత్లను నా రూమ్‌కు రమ్మని చెప్పాను. ఏం జరిగిందో తెలియదు కానీ, మా సోదరులు, మనోజ్ మామ కలిసి ఉదయం 3 గంటలకు నా రూమ్‌కు వచ్చారు. వీళ్లంతా లెజెండ్స్" అని రాహుల్ నవ్వుతూ చెప్పారు. ఇదంతా జరుగుతుండగా.. దిశా 'ఇంకా మన గదిలో ఎవరైనా ఉన్నారా' అని అడిగిందంటూ చెప్పాడు. రాహుల్ కామెడీ చేసిన ఈ వీడియోను ఓ ఫ్యాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
ఇదీ చదవండి:కార్తి పక్కనే ఉన్నా గుర్తుపట్టని విజయ్!