ETV Bharat / sitara

కంగన 'తలైవి' పూర్తి.. మొక్కలు నాటిన మను - kangana ranaut 'thalaivi' latest news

సింగర్ మనో.. హరిత సవాలు సవాలు స్వీకరించి మొక్కలు నాటారు. మరోవైపు తలైవి చిత్రీకరణ పూర్తయినట్లు హీరోయిన్ కంగన రనౌత్ వెల్లడించారు.

singer mano green india challenge.. kangana ranaut 'thalaivi' shooting completed
మొక్కలు నాటిన మను.. 'తలైవి' పూర్తి చేసిన కంగన
author img

By

Published : Dec 12, 2020, 9:21 PM IST

స్టార్ హీరోయిన్​ కంగనా రనౌత్.. జయలలిత బయోపిక్​ 'తలైవి' షూటింగ్ పూర్తి చేసింది. శనివారం సాయంత్రం ట్వీట్ చేసిన ఆమె.. చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపింది.

ఈ సినిమాలో అరవింద్ స్వామి ఎమ్​జీఆర్​గా, ప్రకాశ్​రాజ్ కరుణానిధి పాత్రల్లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలో విడుదల కానుంది.

ప్రముఖ నేపథ్య గాయకుడు మను.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు. సంగీత దర్శకుడు కోటి విసిరిన హరిత సవాల్​ను స్వీకరించిన.. గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటారు.

మనిషి ఆయువు ఉండాలంటే ప్రాణవాయువు కావాలని, అందుకోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని అన్నారు. సింగర్స్ చిత్ర, సుజాత, శ్వేతా మోహన్ లు మొక్కలు నాటాలని హరిత సవాల్ విసిరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సింగర్ మను

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.