ETV Bharat / sitara

దివికేగిన అమృతగానం.. లతా మంగేష్కర్ అస్తమయం - లతా మంగేష్కర్ కొవిడ్

Lata Mangeshkar dead: భారతీయులు గర్వించదగ్గ పాటలు పాడి చరిత్రలో నిలిచిన గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. అనేక రోజులుగా ముంబయి బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఓ నేపథ్య గాయకురాలిగా మొదలైన ఆమె.. ప్రఖ్యాత గాయనిగా పేరు తెచ్చుకున్నారు.

lata mangeshkar
లతా మంగేష్కర్
author img

By

Published : Feb 6, 2022, 9:50 AM IST

Updated : Feb 6, 2022, 10:31 AM IST

Lata Mangeshkar died: భారత సినీ చరిత్రలో గాయనిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లతా మంగేష్కర్​ తుదిశ్వాస విడిచారు. కరోనా బారినపడిన ఆమె జనవరి 8న ముంబయిలోని బ్రీచ్​ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స అందించిన క్రమంలో కొద్ది రోజులకు కోలుకున్నారు. అయితే.. శ్వాస సంబంధిత సమస్య తీవ్రమవటం వల్ల 28 రోజుల చికిత్స అనంతరం ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆమె సోదరి ఉషా మంగేష్కర్​ వెల్లడించారు.

"ఆదివారం ఉదయం 8.12 గంటలకు లతా మంగేష్కర్​ కన్నుముశారు. కొవిడ్​ అనంతరం 28 రోజుల పాటు చికిత్స తీసుకున్నారు. పలు అవయవాలు దెబ్బతినటం వల్ల ప్రాణాలు కోల్పోయారు."

- డాక్టర్​ ప్రతిత్​ సందాని, ముంబయి బ్రీచ్​ కాండీ ఆసుపత్రి

గాయని లతా మంగేష్కర్​ తుదిశ్వాస విడిచినట్లు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. ఆమె చికిత్స పొందుతున్న బ్రీచ్​ కాండీ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

⦁ లతా మంగేష్కర్.. 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్​లోని ఇండోర్​లో జన్మించారు.

⦁ లతా మంగేష్కర్​ తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్​, శుద్దమతిల మొదటి సంతానం.

⦁ ఐదేళ్ల వయసులోనే తండ్రి దగ్గర సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు.

⦁ 13 ఏళ్ల వయసులో తండ్రి మరణంతో సినీ రంగంలోకి 1942లో నేపథ్య గాయనిగా ప్రవేశించారు.

⦁ దేశ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి ప్రముఖ గాయకులు పాకిస్థాన్ వెళ్లిపోవడం వల్ల లతా మంగేష్కర్ దశ తిరిగింది. స్టార్ సింగర్​గా పేరు తెచ్చుకున్నారు.

⦁ లతా మంగేష్కర్​ పాడిన తొలి పాటను సినిమా నుంచి తొలగించారు.(మరాఠి చిత్రం కోసం)

⦁ 'మహల్'(1949) సినిమాలోని ఆయేగా ఆనే వాలా పాటతో లతా కెరీర్​ మలుపు తిరిగింది.

⦁ సొంత నిర్మాణ సంస్థలోని తెరకెక్కించిన 'లేఖిని' సినిమాలోని పాట జాతీయ అవార్డును లతాను వరించింది.

⦁ 1948-78 మధ్య 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్​ రికార్డుల్లో చోటు దక్కించుకున్నారు.

⦁ మొత్తంగా 980 చిత్రాలకు గాత్రాన్ని అందించారు. 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు.

⦁ 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న పురస్కారాలు సొంతం చేసుకున్నారు లతా మంగేష్కర్.

⦁ కె.ఎల్.సైగల్​ పాటలంటే లతా మంగేష్కర్​కు చాలా ఇష్టం. ఆయనకు ఈమె వీరాభిమాని కావడం విశేషం.

⦁ 1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా పాడిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

⦁ 1962లో లతాపై విషప్రయోగం జరిగింది. చేసిందెవరో ఇప్పటికీ తెలియలేదు.

⦁ 1974లో లండన్​లోని రాయల్ ఆల్బర్డ్​ హాల్​లో సంగీత కచేరీ నిర్వహించారు లతా మంగేష్కర్.

⦁ భారతీయ నేపథ్య గాయకుల రాణి అని లతా మంగేష్కర్​ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కథనాన్ని ప్రచురించింది.

⦁ 1999లో ఆమె పేరు మీద లతా ఎయు డె పెర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తి విడుదల చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 6, 2022, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.