లైంగిక వేధింపులు, మీటూ ఘటనలపై ఎప్పుడూ తన గళం వినిపించే ప్రముఖ గాయని చిన్మయి.. ఇప్పుడు మరోసారి అలాంటి విషయమే బయటపెట్టింది. తెలంగాణలో ఓ యువతికి ఎదురైన ఓ షాకింగ్ అనుభవాన్ని తన ట్విట్టర్లో పంచుకుంది. ఇంతకీ అందులో ఏముందంటే?
-
PSA.
— Chinmayi Sripaada (@Chinmayi) January 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
This is in Telangana. pic.twitter.com/27BGj6HHoT
">PSA.
— Chinmayi Sripaada (@Chinmayi) January 18, 2020
This is in Telangana. pic.twitter.com/27BGj6HHoTPSA.
— Chinmayi Sripaada (@Chinmayi) January 18, 2020
This is in Telangana. pic.twitter.com/27BGj6HHoT
"ఓ సారి నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తుంటే, 28 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి, నా ముందు బైక్ ఆపి నన్ను ఓ అడ్రస్ అడిగాడు. నేను చెప్పాను. అతడు అతి తెలివి ప్రదర్శిస్తూ.. 'నాకు ఇది సరిగ్గా అర్థం కావడం లేదు. నాతో పాటు బైక్పై వచ్చి చూపిస్తారా' అని అన్నాడు. ఎవరైనా అబ్బాయిని తీసుకెళ్లండి అని చెప్పాను. కానీ అతడు వినలేదు. తన దగ్గర లైసెన్స్ లేదని, ఒకవేళ పోలీసులు పట్టుకున్నా, వెనక అమ్మాయి ఉంది కాబట్టి వదిలేస్తారని సాకులు చెప్పాడు. భయమేసి, నన్ను పికప్ చేసుకోవడానికి మా అన్నయ్య వస్తాడని చెప్పి, పరుగులు తీశా. ఇంటికి వెళ్లడానికి నాకు రెండు గంటలు పడుతుంది. ఆరోజు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి వెళ్లాను. షాకింగ్ ఏంటంటే.. ఈ అనుభవం ఎదురైన కొద్దిరోజుల తర్వాత, నా చెల్లికీ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బస్సు, ట్రైన్ల్లో ప్రయాణిస్తున్న చాలా మంది ఆడపిల్లలకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. ఏవో సాకులు చెప్పి నంబర్లు తీసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. నాకే కాదు నా స్నేహితులకు చాలా మందికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది" -చిన్మయి ట్విట్టర్ పోస్ట్
అయితే ఈ విషయం చెప్పిన అమ్మాయి ఎవరనే విషయం చిన్మయి రహస్యంగా ఉంచింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇవీ చదవండి: