ETV Bharat / state

కన్న కూతురిపై అత్యాచారం చేసిన కర్కశ తండ్రి - father rape

అమ్మాయిలకు తండ్రి అంటే ఎనలేని ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఇష్టం ఉంటుంది. వారి మధ్య అనుబంధం లెక్కగట్టలేనిది. కూతురిని తండ్రి కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎవరైనా వేధిస్తే నాన్నకు చెప్పుకుంటుంది. అలాంటిది తండ్రే కుమార్తెపై పదే పదే అత్యాచారం చేస్తే...

father rape on his own daughter
కూతురిపై పలుమార్లు అత్యాచారం చేసిన కసాయి తండ్రి
author img

By

Published : Jan 17, 2020, 2:45 PM IST

కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కాలనాగులా మారాడు. అభం శుభం తెలియని కన్న బిడ్డపై కన్నేశాడు. రోజుల తరబడి తండ్రి అనే ముసుగులో కామాంధుడు అరాచకం చేస్తున్నాడు. ఎవరికీ చెప్పుకోలేక చిన్నారి తన బాధను పంటి బిగువున భరించింది. తండ్రి మారతాడు అనుకుంది. కానీ ఆ కర్కశుడిలో మార్పురాలేదు.

సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన బాలికపై మళ్లీ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. వెదురుకుప్పంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పిల్లలు బయట వసతి గృహాల్లో చదువుకుంటున్నందు వల్ల తల్లులు బయట ప్రాంతాల్లో పనులకు వెళ్తున్నారు.

వారిలో ఓ బాలిక సమీప పట్టణంలో ఆరో తరగతి చదువుతోంది. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా తండ్రి బాలికను లైంగికంగా వేధిస్తూ... భయాందోళనకు గురి చేశాడు. భయపడిన బాలిక ఎవరితో ఈ విషయం చెప్పలేకపోయింది. తాజాగా ఈనెల 14న పండగ సెలవులకు ఇంటికి వచ్చిన బాలికపై దుర్మార్గుడు మరోమారు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సుమన్‌ కేసు నమోదు చేశారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని, బాలికను వైద్య పరీక్షల కోసం తిరుపతి వైద్యశాలకు తరలించారు.

ఇవీ చూడండి: నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.