ETV Bharat / sitara

క్రియేటివ్ సినిమాలంటే గుర్తొచ్చేది 'సింగీతం' - ప్రభాస్ సింగీతం శ్రీనివాసరావు

ఏ సదుపాయలు లేనప్పుడే తన క్రియేటివిటితో టాలీవుడ్​లో అద్భుతాలు సృష్టించారు. 1990లో మనల్ని టైమ్​ మిషన్ ఎక్కించి ఊహాలోకాల్లో తిప్పారు. ఇప్పటికీ నవ యవ్వనత్వంతో దూసుకుపోతున్నారు దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈటీవీ భారత్​ అందిస్తున్న ప్రత్యేక కథనం.

singeetam srinivasa rao birthday special story
సింగీతం శ్రీనివాసరావు
author img

By

Published : Sep 21, 2020, 6:54 PM IST

Updated : Sep 21, 2020, 8:49 PM IST

కాలర్ లెస్ పచ్చ టీ షర్ట్... రిమ్ లెస్ లెన్సెస్.. కాళ్లకు సాండల్స్ ...

మామూలుగా అయితే ఏ సాప్ట్ వేర్ ఇంజనీరో .. అమెరికన్ గ్రాడ్యుయేట్ కో ఉండే ఆహార్యం..

కానీ.. నవ యువ కుర్రోడికి మాత్రం 80 ప్లస్. ఆయన చిన్నప్పటి నుంచీ అంతే... చాలా ముందుంటాడు!

"సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ.. అనిపించిన ఆ కుర్రోడు" ఈరోజుతో 88 క్రాస్ చేసేశాడు.. త్వరలోనే సెంచరీ!

ఎవరో గుర్తుకొచ్చిందా.. అవును ఆయనే సింగీతం శ్రీనివాసరావు. ద వర్సటైల్ డైరక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా!

టైమ్​తో సంబంధం లేని వ్యక్తి ఆయన. కానీ ఆయన టైమ్ మాత్రం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. మరి తీసినవన్నీ కాలాతీతమైన సినిమాలే కదా.

అప్పుడే టైమ్ మెషీన్ ఎక్కేస్తున్నారా! సరే పదండి... అక్కడకే వెళదాం.. అప్పుడెప్పుడో.... 88 ఏళ్ల కిందట అప్పటి మద్రాసు రాష్ట్రంలో ఉండే.. ఇప్పటి ఉదయగిరిలో పుట్టారు ఆయన..! మనిషి మహా.. క్రియేటివ్.. అందుకే కాలేజీ రోజులకే అన్ని వేషాలు వేసి.. మదరాసుకు చేరారు. ఆయన పనిచేసిన వాళ్లంతా మహామహులైతే.. ఆ తర్వాత ఆయనతో పనిచేసిన వాళ్లు హేమాహేమీలు! కేవీ రెడ్డి గారి శిష్యరికంలో మాయాబజార్ మహత్తులో మునిగి తేలారు. ఆల్ టైమ్ వండర్ సినిమాకు ఇప్పటికీ ఉన్న ఏకైక రిఫరెన్స్ ఆయనే! ఓ పక్క తనలోని క్రియేటివిటీని దాచుకుంటూనే... సినిమాపై అవగాహన కోసం అనేక సినిమాలకు, పనిచేశారు.

పనిచేయడమంటే అలా ఇలా కాదు చాలా వాటికి ఆయన అసిస్టెంట్ డైరక్టర్... కొన్నింటికి స్క్రీన్ రైటర్.. కొన్నింటికీ ఎడిటర్, కొన్నింటికీ లిరిసిస్ట్, కొన్నింటికి సౌండ్ ఇంజనీర్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. సినిమా క్రియేటివిటీలో ఆయన టచ్ చేయని సబ్జెక్టు లేదు.

1972లో 'నీతి నిజాయతీ' అనే తెలుగు సినిమాతో ఆయనలోని దర్శకుడు బయటకొచ్చాడు.. ఆ తర్వాత... కొన్ని తమిళ, తెలుగు సినిమాలు చేశాక.. కన్నడ సూపర్​స్టార్ రాజ్ కుమార్ తో తిరుగులేని సినిమాలు తీశారు. ఆయన ఇద్దరు కొడుకులతోనూ సినిమా తీసిన ఏకైక దర్శకుడు ఈయనొక్కడే!

అందరికీ యువకుడిగా ఉన్నప్పుడు.. ప్రయోగాలు చేయాలనో.. క్రియేటివిటీ చూపించాలనో ఉంటుంది. కానీ ఈయన మాత్రం హాఫ్ సెంచరీ( వయసులో) తర్వాత విజృంభించారు. అలా తొలిసారి ప్రయోగాత్మక చిత్రంతో సత్తా చూపారు.

సుధాచంద్రన్ జీవిత కథతో వచ్చిన మయూరి సినిమా అటు తెలుగు సినీ చరిత్రలోనూ. ఆయన సినిమాల్లోనూ గుర్తుంచుకోదగింది. ఉషాకిరణ్ మూవీస్ తీసిన ఈ బయోపిక్​లో నిజజీవిత నాయిక సుధాచంద్రనే నటించారు. జాతీయ ఉత్తమ చిత్రంగా (ప్రత్యేక ప్రశంస)తో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ చిత్రంగానూ నిలిచింది.

ఆ తర్వాత కమల్​తో వండర్స్ చేశారు. మైకేల్ మదన కామరాజ్ లాంటి కామెడీ ఎంటర్ టైయినర్, మూకీ సినిమా పుష్పకవిమానం కానీ, విచిత్ర సోదరులు కానీ.. చివరాఖరులో వచ్చిన ముంబై ఎక్స్​ప్రెస్ కానీ.. వేటికవే.. క్రియేటివ్ బ్రిలియంట్స్.. కమల్ లాంటి క్రియేటివ్ జీనియస్...ఆయనతో అన్నిసార్లు చేశాడంటేనే ఇక చెప్పేదేముంటుంది.

1990 , 1991 మన తెలుగు సినిమాకు మెమరబుల్స్.. ఇంద్రలోకాన్ని ఇలపైకి దించి.. రాఘవేంద్రరావు.. శ్రీదేవీ మత్తులో ముంచేస్తే.. ఆ మరుసటి ఏడాదే సింగీతం శ్రీనివాసరావు.. చంద్రమండలాన్నే చూపించేశారు. జగదేకవీరుడు అనే సోషియో ఫాంటసీ.. ఆదిత్య 369 అనే సైన్స్ ఫిక్షన్ వరుసగా వచ్చి మన వాళ్ల సత్తాను ప్రపంచానికి చాటాయి.

ఆదిత్య 369 ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల పెద్దోళ్ల వరకూ అందరినీ, స్క్రీన్లకు కట్టిపడేసింది. మన ఊహలకు కూడా అందని ఫాంటసీని స్కీన్ పైకి తీసుకొచ్చి సంభ్రమాశ్చార్యాలకు గురిచేశారు సింగీతం. సైన్స్ మూవీ అంటే ఏదో డ్రైగా ఉన్నట్లు కాకుండా, మన నేటివిటీ టచ్ ఇవ్వడం నభూతో! కృష్ణదేవరాయలు కాలాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. నేరుగా తీసిన చారిత్రక చిత్రాల్లో కూడా రాయల శకం... అంత హైలైట్ అవ్వలేదు. ఇళయరాజా మ్యూజిక్.. సింగీతం మ్యాజిక్.. బాలకృష్ణ పర్​ఫార్మెన్స్.. అన్నీ కలిసి ఆ సినిమాను పీక్స్​లో నిలబెట్టాయి. సినిమా వచ్చి 30 ఏళ్లయినా దక్షిణాదిలో నెంబర్ వన్ సైన్స్ ఫిక్షన్ అంటే.. ఇప్పుడు కూడా దానికే ఓటేశారు జనాలు. ఆ చిత్రం ఇంపాక్ట్ ఆ రేంజ్​లో ఉంది. ఆ సినిమా పాటలు వింటే టైమ్ మిషన్ ఎక్కకుండానే ఎక్కడికో వెళ్లిపోతారు! డైరక్టర్​కు మ్యూజికల్ టచ్ లేకపోతే.. అది సాధ్యం కాదు.

భైరవ ద్వీపం.. బాలకృష్ణ కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో రెండింటినీ ఆయనే ఇచ్చారు. ఇక దీని గురించి చెప్పేదేముంది. మోడ్రన్ టైమ్ లో మెస్మరైజ్ చేసిన జానపద సినిమా! ఆయన క్రియేటిటీ గురించి చెప్పుకునే ఇంకో ఘటన ఈ సినిమాలోనే జరిగింది. షూటింగ్ అవుతోంది. గీత రచయిత వేటూరి బిజీగా ఉండి.. పాటలు ఇవ్వలేకపోతున్నారు. అందుకని సరదాగా ఆయనే విరిసినదీ వసంతగానం పాట రాసేశారు. ఆ తర్వాత వేటూరి చూసి.. నేను రాసినా ఇంతకన్నా.. బాగా ఏమీ ఉండదు. ఇదే ఉంచేయండి అన్నారు.

ఒకటా రెండా ఆయన చేసిన వండర్స్ అన్నీ ఇన్నీ కావు. కమల్ లాంటి నటుడిని పెట్టుకుని... సైలంట్ మూవీ తీసే సాహసం ఎవరు చేస్తారు.. సింగీతం తప్ప..!? ( అఫ్ కోర్స్ ఆ మూవీ ఎవరు చేస్తారు.. కమల్ తప్ప..!) కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో .. అనేక కేరక్టర్లతో రెండు గంటల పాటు.. నిలబెట్టడం అంటే మాటలు కాదు. అందుకే ఈ సినిమాకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ప్రఖ్యాత విమర్శకులంతా.. దానిని అద్భుతం అన్నారు. అనేక పత్రికలు అమోఘం అని ప్రశంసించాయి. ఆనందవికటన్ , సీఎన్ఎన్ ఐబీఎన్.. వంద అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా దానిని గుర్తించాయి. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ సినిమా ఇఫీ, కేన్స్ లో నూ.. ప్రీమియర్ అయింది. విచిత్ర సహోదరుల్లో మరుగుజ్జుగా కమల్ పండించిన అత్యుత్తమ నటనకు.. సింగీతం అద్భుత దర్శకత్వ ప్రతిభ తోడైంది. అసలు ఆ ఐడియానే ఒక అద్భుతం. ఆయన తీసిన చివరి సినిమా.. ముంబై ఎక్స్​ప్రెస్ కామెడీ టైమింగ్​ను ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. ఆ తర్వాత ఘటోత్కచ్ అనే యానిమేషన్ చిత్రం తీశారు. అది అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది.

రెండు నేషనల్ అవార్డులు..

ఆరు నంది అవార్డులు..

మూడు ఫిల్మ్​ఫేర్ లు

తమిళ, కన్నడ స్టేట్ అవార్డులు

ఇవేమీ ఆయన క్రియేటివిటీకి కొలమానాలు కావు. అసలు ఆయన అవార్డుల కోసం సినిమాలు తీసే టైపు కాదు. ఈ వయసులోనూ టీవీ ఇంటర్వూల్లో ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడో.. ఆయనను చూస్తే.. ఆ కళ్లల్లో మెరుపు చెబుతుంది. సినిమా పట్ల ఆయనకున్న ప్రేమ, ఫ్యాషన్! అందుకే కమల్ లాంటి క్రియేటివిటీ జీనియస్​లు ఆయనతో కలిశారు. ఆయన సినిమాలు కేన్స్ పనోరమాల్లో ప్రదర్శితమయ్యాయి. ఐఎఫ్ఎఫ్ఐ సహా అనేక జ్యూరీల్లో సభ్యుడిగా ఉన్నారు. పెద్దోళ్లలో పెద్దోడు.. చిన్న పిల్లల్లో పిల్లాడు.. అందుకే అలా మోడరన్, యంగ్ లుక్​తో ఎప్పుడూ ఫ్రెష్​గా ఉంటారు. ఇప్పటికీ సినిమాల పట్ల అదే ఉత్సాహంతో ఉంటారు. ఎప్పుడో 70 ఏళ్ల కిందట మాయాబజార్​లో వాడకుండా వదిలేసిన 'కుశలమా' అనే పాటను తన మనవరాలితో కలిసి ఆలపించారు. ఇప్పుడు ప్రభాస్​తో నాగ్ అశ్విన్ తీస్తున్న పాన్ ఇండియా సైన్స్ ఫిక్షన్ సినిమాకు సింగీతం మెంటార్​గా వ్యవహరిస్తున్నారు. నాటి మాయాబజార్ నుంచి నేటి ప్రభాస్ చిత్రం వరకూ ఆయన మాయాజాలం అలా కొనసాగుతూనే ఉంది.

సింగీతంగారు మీరు సెంచరీలు కొట్టేయాలని కోరుకుంటూ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Last Updated : Sep 21, 2020, 8:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.