శరీరాకృతిని మార్చుకునే క్రమంలో ఫిట్‌గా మారి.. లగ్జరీ కారును బహుమతిగా అందుకున్నారు నటుడు శింబు. సాధారణంగా కొంచెం బొద్దుగా కనిపించే ఈ హీరో.. లాక్‌డౌన్ సమయంలో షూటింగ్స్ లేకపోవడం వల్ల శరీరాకృతిపై దృష్టి పెట్టారు. ట్రైనర్ సాయంతో జిమ్‌లో వర్కౌట్లు, డ్యాన్స్, యోగా.. ఇలా ఎన్నో విధాలుగా శ్రమించి సన్నబడ్డారు. ఇటీవల తన ఫిట్‌నెస్ ట్రైనింగ్‌కు సంబంధించిన ఓ ప్రత్యేకమైన వీడియోను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. శింబు లుక్ చూసి అభిమానులు సైతం ఫిదా అయ్యారు.
శింబు కథానాయకుడిగా నటిస్తున్న ఈశ్వరన్ సినిమా కోసమే ఆయన సన్నబడినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత వచ్చే మానాడు సినిమాలోనూ ఇదే లుక్‌లో కనిపించనున్నారట. అయితే, వృత్తిపట్ల, ఫిట్‌నెస్ విషయంలో శింబు చూపించిన చొరవకి ఆయన తల్లి ఉషా మురిసిపోయారు. మినీ కూపర్ బ్రిటిష్ రేసింగ్ కారును శింబుకు బహుమతిగా ఇచ్చి.. ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కారు ధర దాదాపు రూ. 50లక్షలు ఉండొచ్చని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
ఇదీ చూడండి : శింబు గొప్ప మనసు.. కానుకలతో సిబ్బందికి సర్ప్రైజ్