ETV Bharat / sitara

Sidharth Shukla Death: సిద్దార్థ్​ అంత్యక్రియలు.. ప్రేయసి కన్నీటి వీడ్కోలు - బాలీవుడ్ న్యూస్

ప్రముఖ నటుడు సిద్దార్థ్ శుక్లాకు(Sidharth Shukla) అతడి ప్రేయసి షెహనాజ్ కన్నీటి వీడ్కోలు పలికింది. శుక్రవారం(సెప్టెంబరు 3) మధ్యాహ్నం జరిగిన అతడి అంత్యక్రియల్లో కనిపించిన ఈ దృశ్యం.. చూసినవాళ్లను కన్నీరుపెట్టేలా చేసింది.

Sidharth Shukla funeral
మూవీ న్యూస్
author img

By

Published : Sep 3, 2021, 3:49 PM IST

గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన బాలీవుడ్​ నటుడు సిద్దార్థ్ శుక్లా(40) అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని(Mumbai News) ఓషివారా శ్మశానవాటికలో ఈ క్రియలు జరిగాయి. అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు.. సిద్దార్థ్​కు కన్నీటి వీడ్కోలు పలికారు.

ఈ అంత్యక్రియల్లోనే పాల్గొన్న సిద్దార్థ్​ ప్రేయసి షెహనాజ్​ గిల్(Shehnaaz Gill)​ కండతడి పెట్టడం.. అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆమె ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్​గా మారింది. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆ ఫొటోను చూసి సిద్ధార్థ్​తో పాటు పలువురు అభిమానులు దుఖఃసాగరంలో మునిగిపోయారు.

అయితే గురువారం రాత్రి ముంబయి ఆస్పత్రిలో సిద్దార్థ్​ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించారు. శరీరం ఎలాంటి గాయాలు లేవని అతడి సన్నిహితులు చెబుతున్నారు. అయితే గుండెపోటుతో చనిపోయాడని కొందరు అంటుండగా.. అతడి మృతికి సరైన కారణం తెలియాల్సి ఉంది.

మోడల్​గా కెరీర్​ ప్రారంభించిన సిద్దార్థ్​ శుక్లా.. 'బబుల్ కా అంగాన్ చోటే నా' సీరియల్​తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్​లో కనిపించినప్పటికీ 'బాలికా వధు'తో(Balika Vadhu)(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) చాలా గుర్తింపు తెచుకున్నారు. 'బిగ్​బాస్ 13'లో(bigg boss 13 winner) విజేతగా నిలిచి, సినిమాలతో పాటు వెబ్ సిరీస్​ల్లోనూ అవకాశాలు దక్కించుకున్నారు. చివరగా 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్ 3' షోలో కనిపించారు సిద్దార్థ్.

Sidharth Shukla funeral
సిద్దార్థ్ శుక్లా

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.