ETV Bharat / sitara

గాయకుడిగా మారిన సిద్ధాంత్.. తొలి పాట రాబోతుంది - సిద్ధాంత్​ చతుర్వేది తొలి పాటు

వచ్చే వారంలో తాను ఆలపించిన మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు తెలిపాడు బాలీవుడ్​ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది. దీనికి సంబంధించి ఇన్​స్టాలో ఫొటోలను పోస్ట్​ చేశాడు.

Siddhant Chaturved
సిద్ధాంత్​ చతుర్వేది
author img

By

Published : Jun 1, 2020, 8:59 PM IST

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు తమకిష్టమైన వ్యాపకాలతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా బాలీవుడ్​ నటుడు సిద్ధాంత్‌ చతుర్వేది.. ఇన్​స్టా ద్వారా తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. స్వయంగా తన గొంతుతో పాడిన ఓ పాటను వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు. సిద్ధాంత్ పాడిన తొలి పాట ఇది. ఇన్​స్టాలో ఓ ఫొటో పోస్ట్​ చేసి ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇందులో బెడ్​పై ఓ గిటార్​ పట్టుకుని పడుకుని ఏదో ఊహల్లో తేలుతున్నట్లుగా కనిపించాడీ నటుడు​.

"ఈ ఖాళీ సమయంలో ఏదైనా చేయాలని ఆలోచించాను. నేనే ఓ పాట పాడితే ఎలా ఉంటుంది? అని భావించా.. సరే.. ప్రజల కోసం ఏదైనా చేయాలి" అంటూ వ్యాఖ్య జోడించాడు.

ఈ ఫొటోతో పాటు మరో ఫొటోను పోస్ట్​ చేశాడు. ఇందులో ఓ స్టేజిపై మైక్​ పట్టుకుని పాట పాడుతున్నట్లుగా కనిపించాడు. "ప్రస్తుతం ఓ పాటను సిద్ధం చేస్తున్నాను.. వచ్చే వారం దీన్ని విడుదల చేయనున్నా" అంటూ వ్యాఖ్య జోడించాడు.

ప్రస్తుతం 'బంటీ ఔర్ బబ్లీ 2'లో నటిస్తున్నాడు సిద్ధాంత్. 2005లో విడుదలైన 'బంటీ ఔర్‌ బబ్లీ' సినిమాకు సీక్వెల్​గా తెరకెక్కుతోందీ సినిమా. సైఫ్‌ అలీఖాన్, రాణీముఖర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇదీ చూడండి : 'సోనూ.. నా భర్త నుంచి దూరం చేయవా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.