ETV Bharat / sitara

'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతాబసు​కు కొత్త ఆఫర్​ - saqib saleem upcoming film

టాలీవుడ్​లో తొలిసినిమాతోనే కుర్రకారును మైమరింపచేసి వారి హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి శ్వేతాబసు ప్రసాద్‌. తెలుగు తెరపై చాలా రోజులుగా కనిపించని ఈ 'కొత్త బంగారు లోకం' ఫేం.. బాలీవుడ్​లో మరో ఆఫర్​ కొట్టేసింది. నటుడు షకీబ్​ సలీంతో కలిసి కామెడీ కపుల్​గా కనిపించేందుకు సిద్ధమౌతోంది.

actress swethabasu prasad
'కొత్త బంగారు లోకం' ఫేం శ్వేతాబసు​కు కొత్త ఆఫర్​
author img

By

Published : Jul 23, 2020, 4:33 PM IST

దక్షిణాది తెరకు దూరమైన నటి శ్వేతాబసు ప్రసాద్​.. బాలీవుడ్​లో మాత్రం ఆఫర్లు దక్కించుకుంటోంది. 2017 నుంచి ఏడాదికి ఓ సినిమా చొప్పున చేస్తోంది. అంతేకాకుండా వెబ్​ సిరీస్​ల్లోనూ తన నటనతో ఆకట్టుకుంటోంది. తాజాగా 'కామెడీ కపుల్'​ అనే సినిమాలో నటించేందుకు పచ్చజెండా​ ఊపేసింది.

Shweta Basu Prasad, Saqib Saleem
షకీబ్​ సలీం, శ్వేతాబసు ప్రసాద్​

ఇందులో హిందీ నటుడు షకీబ్ సలీంతో కలిసి కనువిందు చేయనుంది. రొమాన్స్​, కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నచికేత్​ సమంత్​ తెరకెక్కిస్తున్నాడు. యోడ్లే ఫిల్మ్స్​ సంస్థ నిర్మిస్తోంది. పూర్తి తారాగణం, సాంకేతిక బృందం వివరాలు త్వరలో ప్రకటిస్తామని చెప్పింది చిత్రబృందం.

దర్శకుడు నచికేత్​ గతంలో మరాఠీ చిత్రాలు 'గచ్చీ', 'హబడ్డీ', 'గుడ్​ బడ్డీ గడ్బడీ' వంటి సినిమాలు తెరకెక్కించాడు. అయితే 'కామెడీ కపుల్​' ద్వారా బాలీవుడ్​లోకి అడుగుపెట్టాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం శ్వేత.. 'డాక్టర్​.డాన్​' అనే వెబ్​సిరీస్​లోనూ నటిస్తోంది. ఇందులో రేఖ అనే లాయర్ పాత్ర పోషిస్తోంది. షకీబ్​ చివరిగా సల్మాన్​ నటించిన 'రేస్​-3', కబీర్​ఖాన్​ స్పోర్ట్స్​ డ్రామా '83'లోనూ నటించాడు. 1983 ప్రపంచకప్​ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆల్​రౌండర్, వైస్​ కెప్టెన్​​ మెహిందర్​ అమర్​నాథ్​గా నటించాడు. ఇప్పటికే నిర్మాణపనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. కరోనా కారణంగా విడుదల వాయిదాపడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.