ETV Bharat / sitara

థియేటర్​లో 'సినిమా'కు మళ్లీ కష్టాలు తప్పవా? - కొవిడ్ కేసులు

ఇటీవల కాలంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. సినీ ప్రేక్షకుడిని ఆందోళనలో పడేస్తోంది. థియేటర్లు ఏమైనా మూసేస్తారా అని భయపడుతున్నాడు. ఇంతకీ దానికి కారణమేంటి?

shut down fear of movie theatres amid covid second wave!
సినిమా థియేటర్
author img

By

Published : Mar 20, 2021, 5:31 PM IST

'నేను ఓ సగటు సినీ ప్రేక్షకుడిని. మూడు కొత్త సినిమాలు అయిన చూడందే నాకు నెల గడిచేది కాదు. కానీ కరోనా వల్ల గతేడాది మార్చి నుంచి అస్సలు థియేటర్​కే వెళ్లలేకపోయాను. ఈ ఏడాది సంక్రాంతి నుంచి తెలుగులో కొత్త చిత్రాల్ని విడుదల చేశారు. అయితే మొదట్లో థియేటర్​కు వెళ్లాలా వద్దా అని తటపటాయించిన నేను.. వారానికి మూడు నుంచి నాలుగు సినిమాలు వస్తుండటం వల్ల ఆగలేకపోయాను. వారానికి ఓ సినిమా చూసేస్తున్నాను.'

'ఈ మధ్యే 'జాతిరత్నాలు' చూసి తెగ నవ్వుకున్నాను. ఇప్పుడు వచ్చే వారం రాబోయే చిత్రాల కోసం ప్లాన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతుండటం వల్ల నాకు భయం పట్టుకుంది. థియేటర్లు ఏమైనా తిరిగి మూసేస్తారా? సినిమాల్ని మళ్లీ ఓటీటీలో చూడాలా? అనే ఆలోచన నా మెదడును తినేస్తోంది'.. ఇక్కడ నేను అనే పదం ప్రతి సినీ ప్రేక్షకుడి వర్తిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం పరిస్థితి అలానే కనిపిస్తోంది.

గుజరాత్​లో థియేటర్లపై ఆంక్షలు

ఇటీవల కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల గుజరాత్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారాంతాల్లో షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్​లను పూర్తిగా మూసి వేయాలని కీలక ఆదేశాలను గురువారం(మార్చి 18) జారీ చేసింది. ప్రస్తుతం వారాంతానికే ఇది పరిమితమైనప్పటికీ.. కొవిడ్ కేసులు పెరిగితే థియేటర్లపైనా ఆంక్షలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి?

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కరోనా నిబంధనలు పాటిస్తూ, 100 శాతం సామర్ధ్యంతో థియేటర్లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో రోజూవారీ కేసులు పెరుగుతుండం.. ప్రభుత్వాల్ని కలవరపరుస్తున్న అంశం. ఇలానే కొనసాగితే మళ్లీ థియేటర్ల గడ్డు కాలాన్ని ఎదుర్కొక తప్పదు!

shut down fear of movie theatres amid covid second wave!
ఓటీటీల వైపు ప్రేక్షకుడు

ఓటీటీల పరిస్థితేంటి?

ఒకవేళ కరోనా కేసులు పెరిగి, థియేటర్ల మూసేసే పరిస్థితి ఏమైనా వస్తే.. మళ్లీ సినీ ప్రేక్షకుడు ఓటీటీ వైపే చూస్తాడు. ఇప్పటికే దానికి బాగా అలవాటుపడ్డ ప్రేక్షకుడికి అది పెద్ద కష్టం కాకపోవచ్చు. కాబట్టి ఓటీటీలకు ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.