ETV Bharat / sitara

ShrutiHassan: నాలో ఆ మార్పును గుర్తించారు - శ్రుతిహాసన్​ సంగీతం

దాదాపు రెండేళ్ల పాటు గ్యాప్​ తీసుకుని ఇటీవల 'క్రాక్'(Krack)​, 'వకీల్​సాబ్'(VakeelSaab)​ సినిమాలతో అలరించింది ముద్దుగుమ్మ శ్రుతిహాసన్(Shruti Hasan)​. అయితే ఈ విరామం ఎందుకు తీసుకుందో ఆమె వివరించింది. ఆ సమయంలో నటనతో పాటు తనకిష్టమైన సంగీతంపైనా దృష్టి సారించినట్లు తెలిపింది.

ShrutiHassan
శ్రుతిహాసన్
author img

By

Published : May 31, 2021, 8:01 AM IST

'విరామం అనేది నాకు నేనుగా తీసుకున్నదే. అది నన్ను నేను ఎంతగానో మార్చుకోవడానికి తీసుకున్న నిర్ణయం. ఆ మార్పును ఇప్పుడు నా చుట్టూ ఉన్నవారు గుర్తించారు' అని చెప్పుకొచ్చింది అందాల నటి శ్రుతిహాసన్‌(Shruti Hassan). ఇటీవలే 'వకీల్‌సాబ్‌'తో మెప్పించిన ఈ సుందరి ఆన్‌లైన్‌లో పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. 'లాక్‌డౌన్‌కు ముందు మీరు రెండేళ్ల పాటు గ్యాప్‌ తీసుకున్నారెందుకు?' అని అడిగితే ఆమె స్పందించింది.

"పని పట్ల ఆసక్తి లేక కాదు విరామం తీసుకున్నది. దాన్ని మరింత మెరుగ్గా చేయడం కోసం నన్ను సిద్ధం చేసుకోవడానికి. గతంలో సంగీతంపై పెద్దగా దృష్టి పెట్టేదాన్ని కాదు. కానీ అదంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు అటు సంగీతం, ఇటు నటనా రెండింటినీ ఎలా బ్యాలెన్స్‌ చేసుకోవాలో ప్రణాళిక వేసుకున్నా" అంది. "గత లాక్‌డౌన్‌ తర్వాత మొదట నేను 'కాఫీ ఎనీవన్‌' అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించా. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ కోసం 'పిట్టకథలు' చేశా. 'క్రాక్‌', 'వకీల్‌సాబ్‌'లు విడుదలయ్యాయి. తమిళంలో 'లాభం' పూర్తిచేశాను. నా కెరీర్‌ ప్రస్తుతం బిజీగానే ఉంది." అని వివరించింది.

ఇదీ చూడండి : ఫొటోషూట్​లో శ్రుతి స్ట్రైలే సెపరేటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.