ETV Bharat / sitara

ఎయిర్​పోర్ట్​లో కొత్త బాయ్​ఫ్రెండ్​తో శ్రుతి! - శ్రుతిహాసన్

ముంబయి ఎయిర్​పోర్ట్​లో తన కొత్త బాయ్​ఫ్రెండ్​తో దర్శనమిచ్చింది నటి శ్రుతి హాసన్. అతడిని హగ్ చేసుకుని బై చెప్పిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

Shruti Haasan with his new Boyfriend Santanu
ఎయిర్​పోర్ట్​లో కొత్త బాయ్​ఫ్రెండ్​తో శ్రుతి!
author img

By

Published : Jan 29, 2021, 12:45 PM IST

గురువారం తన 35 పుట్టినరోజును ఘనంగా జరుపుకొంది నటి శ్రుతిహాసన్. ముంబయిలోని వీధుల్లో తన కొత్త బాయ్​ఫ్రెండ్​తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. అయితే తాజాగా తన బర్త్​డే పార్టీ ముగిశాక నేడు 'సలార్' షూటింగ్​లో పాల్గొనేందుకు హైదరాబాద్​కు బయల్దేరింది. ఇక్కడా వీరిద్దరూ కనిపించారు.

ముంబయి ఎయిర్​పోర్ట్​కు వీరిద్దరూ కలిసి వచ్చిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఇందులో తన కొత్త బాయ్​ఫ్రెండ్ శంతను హజరిక.. శ్రుతికి వీడ్కోలు పలకడానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో శ్రుతి ఏదో మరిచిపోయినట్లు కనిపించగా.. ఆమె వద్దకు శంతను పరుగెత్తుకుంటూ వెళ్లి ఆ వస్తువు అందించాడు. తర్వాత అతడిని కౌగిలించుకుని బై చెప్పింది శ్రుతి.

గతంలో శ్రుతి హాసన్ లండన్‌కు చెందిన థియేటర్‌ ఆర్టిస్ట్‌ మైఖెల్‌ కోర్సేల్‌తో డేటింగ్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల 2019లో వీరిద్దరూ విడిపోయారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న 'సలార్'​లో హీరోయిన్​గా చేస్తోంది శ్రుతి. ఈ సినిమా గోదావరిఖనిలో షూటింగ్ జరుపుకొంటోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.