Shruthi hassan news: ముద్దుగుమ్మ శ్రుతిహాసన్.. తెలుగు, తమిళంలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'సలార్'లో కథానాయికగా చేస్తోంది. అయితే గతంలో ఓ సినిమా చేసినప్పుడు విమర్శలు ఎదుర్కొన్నానని, ఓ సమయంలో పశ్చాత్తాపానికి కూడా గురయ్యానని తెలిపింది.
2016లో తెలుగులో 'ప్రేమమ్' సినిమా వచ్చింది. అందులో మలర్‌గా శ్రుతిహాసన్ నటించింది. అయితే మలయాళ 'ప్రేమమ్'లో మలర్‌గా కనిపించిన సాయిపల్లవితో శ్రుతిహాసన్‌ను పోల్చుతూ పలు ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ సమయంలోనే నిరూత్సాహానికి గురైన శ్రుతి.. అసలు ఈ పాత్ర తను చేసుండాల్సింది కాదని అనుకున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది కాసేపే అని ఆ తర్వాత మళ్లీ నార్మల్ అయినట్లు తెలిపింది. మలర్ పాత్ర చేసినప్పుడు ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశానని శ్రుతి తెలిపింది.
తెలుగు, తమిళం, హిందీలో నటిస్తూ బిజీగా ఉన్న శ్రుతిహాసన్.. బాయ్‌ఫ్రెండ్ శంతనుతో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తోంది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: