లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు, సరదాగా వారివారి కుటుంబాలతో గడుపుతున్నారు. తాజాగా సోదరీమణులు, హీరోయిన్లు అయిన శ్రుతిహాసన్, అక్షర హాసన్‌లు ఈ ఖాళీ సమయంలో సరదాగా ఓ టిక్‌టాక్ వీడియో చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- View this post on Instagram
Here’s ours 🖤 @aksharaa.haasan this was such a fun idea !! Thankyou cutie 😘
">
ఇందులో వరుసగా ప్రశ్నలు వస్తుండగా, వాటికి సైగలతోనే సమాధానాలు చెబుతున్నారు శుత్రి-అక్షర. ఎవరు సినిమా చూస్తూ ఏడుస్తారు? పుట్టినరోజును మరిచిపోయేది ఎవరు? ఐదుగురి కంటే ఎక్కువమంది పిల్లలు కావాలని ఎవరు అగుడుతున్నారు? అంటూ సాగే ఆసక్తికర ప్రశ్నలు ఆకట్టుకుంటున్నాయి.
"ఫన్నీగా మా ఇద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ అంతా అక్షర హాసన్ ఆలోచనే. థ్యాంక్యూ అందమైన అమ్మాయి" అంటూ ఈ వీడియోకు ట్యాగ్‌లైన్ జోడించి శుత్రి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈమె ప్రస్తుతం రవితేజతో కలిసి 'క్రాక్'లో నటిస్తుంది. అక్షర హాసన్.. విజయ్ అంటోనీతో 'సిరా గుగల్' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో ప్రకాశ్‌రాజ్, అరుణ్ విజయ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ దర్శకత్వం వహిస్తున్నాడు.