మాస్ మహారాజ్ రవితేజ తనకెంతో ప్రత్యేకమని హీరోయిన్ శ్రుతిహాసన్ చెప్పింది. రెండేళ్ల విరామం తర్వాత తిరిగి తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. 'క్రాక్'తో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ఆమె కీలకపాత్రలో నటించిన 'పిట్టకథలు' వెబ్‌సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 19న విడుదల కానుంది. హిందీలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న 'లస్ట్ స్టోరీస్'కు రీమేక్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది. నాగ్‌అశ్విన్ దర్శకత్వం వహించిన ఓ కథలో ఆమె నటించారు. మరికొన్ని గంటల్లో 'పిట్టకథలు' ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రుతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా టాలీవుడ్ హీరోలతో స్ర్కీన్ పంచుకోవడంపై స్పందించింది.
"అల్లుఅర్జున్‌తో కలిసి నేను 'రేసుగుర్రం'లో నటించాను. వృత్తిపట్ల ఆయన అంకితభావంతో పనిచేస్తారు. అలాగే అవసరమైన దానికంటే అదనంగా కష్టపడుతుంటారు. సూపర్‌స్టార్ మహేశ్ విషయానికి వస్తే ఆయన ఫుల్ ఎనర్జీతో ఉంటారు. గ్రేస్‌ఫుల్. ఆయనతో కలిసి స్ర్కీన్ పంచుకునే అవకాశం రావడం నా అదృష్టం. రవితేజ గురించి చెప్పాలంటే ఆయన నాకెంతో ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనతో కలిసి 'బలుపు', 'క్రాక్' చిత్రాలు చేశాను. కెరీర్ ఆరంభంలో 'బలుపు' కోసం ఆయనతో పనిచేస్తున్న సమయంలో నాకెంతో సపోర్ట్ చేశారు. సీనియర్ నటుడనే అహంభావం ఆయనలో ఉండదు. ఒక్కమాటలో చెప్పాలంటే నా హృదయంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది" అని శ్రుతి హాసన్ వివరించింది.
ఇది చదవండి: ఈ ఏడాదిలో పెళ్లి.. నటి శ్రుతిహాసన్ క్లారిటీ