సంగీతంతో పాటు సాహిత్యాన్ని.. నటనతో పాటు నృత్యాన్ని ఆవాహనం చేసుకున్న హీరోయిన్ శ్రుతిహాసన్. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో కొత్త అవతారం ఎత్తనున్నారని సమాచారం. దర్శకురాలిగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారట శ్రుతి. ఇందుకోసం కొద్ది నెలలుగా ఆమె ఓ కథ రాస్తున్నారని తెలిసింది. అది పూర్తవ్వగానే తెరపైకి తీసుకొస్తారని ప్రచారం సాగుతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆ ఈ ఏడాదే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇటీవల రవితేజ 'క్రాక్' సినిమాతో శ్రుతిహాసన్ అభిమానులను పలకరించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్', ప్రభాస్ 'సలార్' సినిమాల్లో నటిస్తున్నారు.
ఇదీ చూడండి: ఆ అనుభూతికి ఏదీ సాటిరాదు: శ్రుతిహాసన్