ETV Bharat / sitara

నాలాంటి భార్యే కావాలట: శ్రుతి హాసన్ - శ్రుతి హాసన్ వకీల్ సాబ్

టాలీవుడ్​కు చాలా గ్యాప్ ఇచ్చింది ముద్దుగుమ్మ శ్రుతి హాసన్. అయితే అంత విరామం ఎందుకిచ్చింది.. లాక్​డౌన్​లో ఏం చేసిందో వివరించింది శ్రుతి. అంతేకాక వరుస సినిమాలతో ఇన్ని రోజుల గ్యాప్​ను మరిపించనుందీ బ్యూటీ.

Shruthi haasan interview
నాలాంటి భార్యే కావాలట: శ్రుతి హాసన్
author img

By

Published : Jan 12, 2021, 7:16 AM IST

శ్రుతిహాసన్‌ కొంచెం గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా ఇటీవలే 'క్రాక్‌' విడుదలైంది. ఇందులో రవితేజతో కలిసి శ్రుతి చేసిన సందడి ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా ఆమె 'ఈనాడు సినిమా'తో మాట్లాడింది. ఆ విషయాలివీ..

నా లాంటి భార్య..

Shruthi haasan interview
చీరకట్టులో మైకం తెప్పిస్తూ

"సినిమాలో శ్రుతి ఆశ్చర్యపరిచింది.. నాకూ శ్రుతిలాంటి భార్య రావాలి.. అంటూ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకోవడం చూశా. నేను చేసిన కల్యాణి పాత్ర వాళ్లకి అంత బాగా నచ్చింది. ఈ పాత్ర స్వతహాగా నాకూ నచ్చింది. కల్యాణి సగటు గృహిణికి ప్రతినిధిలా కనిపిస్తుంది. ఒక అమ్మాయికి పెళ్లయిన తర్వాత, పిల్లలుపుట్టిన తర్వాత కూడా తాను సాధించిన లక్ష్యాల్ని, తన సొంత జీవితాన్ని చాటి చెబుతుంది. ఈ సినిమా చేయడం వెనక కారణాల్లో అదొకటి. నా ప్రయాణంలో ప్రతిసారీ పెద్ద పెద్ద పాత్రలేమీ చేయలేదు. అలాగని 'నటించడానికి అవకాశమే లేదే, శ్రుతి.. ఈ పాత్ర ఎందుకు చేసినట్టు?' అనిపించుకోలేదు. ప్రతి సినిమాలో ఓ ముఖ్యమైన భాగంలా కనిపించే పాత్రలే చేశా. 'వకీల్‌సాబ్‌'లో కూడా నా పాత్ర చిన్నదే. కానీ అది కథపై ప్రభావం చూపిస్తుంది. అలాంటి పాత్రలు చేయడంలోనే నటులకి ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. 'బలుపు' తర్వాత, నా కెరీర్‌ ఈ దశలో ఉన్న సమయంలో రవితేజతో తెరను పంచుకోవడం ఓ కొత్త అనుభవం."

Shruthi haasan interview
'వకీల్ సాబ్', 'క్రాక్'

నాకు ఆ భయం లేదు..

"విరామం వస్తే వెనకబడతామనే భయాలు ఎవరిలోనైనా ఉంటాయేమే కానీ.. నాకు ఆ భయం లేదు. అందుకు కారణం.. నా అభిమానులే. వాళ్లు నన్నొక కుటుంబ సభ్యురాలిగా చూస్తారు. 'కాటమరాయుడు' తర్వాత తీసుకున్న విరామంలో ప్రశాంతంగా నా జీవితం గురించి ఆలోచించుకుంటూ, నాకు నచ్చిన పని చేస్తూ గడిపా. ఇప్పుడు పాత్రల విషయంలో మరిన్ని సవాళ్లు స్వీకరించేంత ధైర్యం కలిగింది. నాకు తెలిసిన నా స్నేహితుల్లో 25 ఏళ్ల వయసులో అమ్మ అయినవాళ్లు చాలామందే. భారతీయ సంస్కృతిలో అదొక భాగం. అమ్మ అయినంత మాత్రానో, లేదంటే తెరపై అమ్మ పాత్రల్లో కనిపించినంత మాత్రానో కెరీర్‌కి వచ్చే ముప్పేమీ లేదు. నిజ జీవితాల్లో ఐశ్వర్యారాయ్‌, కరీనాకపూర్‌ తదితరులు అమ్మ అయ్యారు. కెరీర్‌ పరంగా కూడా అంతే దీటుగా రాణిస్తున్నారు. వాళ్లే మా అందరికీ స్ఫూర్తి."

Shruthi haasan interview
అందాల ముద్దుగుమ్మ

మేమూ చేయగలం..

"చిన్నప్పట్నుంచి శారీరకంగా ధృఢమైన అమ్మాయిని. స్కూల్‌లో ఆటల్లోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ముందుండేదాన్ని. అందుకే సినిమాల్లో పోరాట ఘట్టాలన్నా, పాటలన్నా బాగా ఆస్వాదిస్తా. అయితే ప్రతి సినిమాలోనూ హీరో ఫైట్‌ చేస్తుంటే, నేను ఓ మూల నిలబడి చూడాల్సి వచ్చేది (నవ్వుతూ). కానీ ఈ సినిమా అనుభవం అందుకు భిన్నం. 2019లో అమెరికన్‌ టీవీ షో 'ట్రెడ్‌స్టోన్‌' కోసం బుడాపెస్ట్‌లో 9 వారాలు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నా. అప్పుడు యాక్షన్‌పై నాకు మరింత మక్కువ పెరిగింది. దర్శకుడు గోపీ ఈ సినిమాలో నా పాత్ర గురించి చెప్పగానే మరింత ఆత్రుత కలిగింది. భారతీయ స్త్రీలంతా అలా పోరాటాలు చేయాలని కాదు కానీ, మన మహిళలు అంత బలమైనవాళ్లు అని సంకేతం ఇచ్చేలా 'క్రాక్‌'లో పాత్ర రూపుదిద్దుకుంది."

Shruthi haasan interview
ట్రెండీ లుక్​లో

నాలుగు నెలలు పిల్లితో..

"2020 కోసం ఆసక్తిగా ఎదురు చూశా. కానీ మనందరి ప్రణాళికలు తారుమారయ్యాయి. చాలామంది చనిపోయారు, చాలా మంది ఆరోగ్యసమస్యలతో బాధపడ్డారు. ఆ విషయంలో బాధ ఉంది కానీ..వ్యక్తిగతంగా నేను సృజనాత్మకంగా, ఆధ్యాత్మికంగా ఎదిగానన్న అభిప్రాయం కలిగింది. కరోనా సమయంలో ముంబయిలో నాలుగు నెలలు ఇంట్లో నేను, నా పిల్లి.. మేమిద్దరమే గడిపాం. ఆ తర్వాత చిత్రీకరణ కోసం ముంబయి నుంచి హైదరాబాద్‌ రావల్సి వచ్చింది. 13 గంటల ప్రయాణమని తెలిసినా.. రోడ్డు మార్గంలోనే వెళ్లాలనుకుని కార్లో బయల్దేరా. అన్ని రోజుల తర్వాత మళ్లీ బయట ప్రదేశాల్ని చూస్తూ ప్రయాణం చేయడం ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి కలిగింది. ఈ ఏడాది అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం. ఈ మూడు నాలుగు నెలల కాలంలో తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో నావి నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి. తెలుగులో 'వకీల్‌సాబ్‌' తర్వాత ఇంకా ఏ సినిమా ఒప్పుకోలేదు."

Shruthi haasan interview
మైమరిపించే అందం

ఆనందంగా ఉంది..

"మూడేళ్ల తర్వాత 'క్రాక్‌'తో మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించడం సంతృప్తినిచ్చింది. 'కాటమరాయుడు' తర్వాత నేను తెలుగులో సినిమా చేయలేదు. అభిమానులు ఎప్పుడెప్పుడు అని అడుగుతూనే వచ్చారు. 'క్రాక్‌' గతేడాదే విడుదల కావాల్సింది. కానీ కుదర్లేదు. ఆలస్యమైనా ఒక మంచి సినిమాతో అభిమానుల్ని అలరించానన్న తృప్తి కలిగింది. ప్రస్తుతం ముంబయిలో ఓ హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నా. తెలుగు రాష్ట్రాలకి దూరంగా ఉన్నా.. సామాజిక మాధ్యమాల వల్ల ప్రేక్షకుల స్పందనని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతోంది. పది, పదిహేనేళ్ల కిందట ఇలాంటి సదుపాయం లేదు. ఈ విషయంలో సోషల్‌ మీడియాకి థ్యాంక్స్‌ చెప్పుకోవాలి. విజయాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. మా సినిమా గురించి అందరూ ఉత్కంఠగా ఎదురు చూడటం, ఆ వెంటనే సూపర్‌హిట్‌ అని మాట్లాడుకోవడం ఆనందాన్నిచ్చింది."

Shruthi haasan interview
హాట్​ గాల్

ఇదీ చూడండి: 'కంచె' బ్యూటీ ప్రగ్యా జబర్దస్త్​ క్లిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.