హీరోయిన్ శ్రియ(shriya saran age) షాకింగ్ న్యూస్ చెప్పింది. తనకు ఆడపిల్ల పుట్టిన విషయాన్ని ఏడాది పాటు దాచి, ఇప్పుడు వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఆండ్రూ కొశ్చివ్ను(shriya saran husband name) 2018లో పెళ్లి చేసుకున్న శ్రియ.. గతేడాది కరోనా వచ్చిన సమయంలో భర్తతో కలిసి విదేశాల్లో ఉంది. ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చి, ముంబయిలో ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఆమె గర్భంతో ఉందని, అందుకే ఇక్కడికి వచ్చేసిందని కొన్నిరోజుల నుంచి వదంతులు వస్తున్నాయి. వీటికి ఈ భామ ఇప్పుడు చెక్ పెట్టేసింది.
రష్యన్ టెన్నిస్ ప్లేయర్, బార్సిలోనాకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఆండ్రూను శ్రియ పెళ్లి చేసుకుంది. తొలిసారి ఆండ్రూను శ్రియ మాల్దీవుల్లో కలిసింది. ఆ సమయంలో శ్రియ నటి అని అతడికి తెలియదు. ఆ తర్వాత ఆమెనే అడిగి ఆమె సినిమాలన్నీ చూశాడు. అలా మొదలైన వారి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది.