ETV Bharat / sitara

శ్రద్ధా కపూర్ వాట్సాప్ చాట్ వైరల్.. అతనెవరో? - శ్రద్ధా కపూర్ న్యూస్ వైరల్

నటి శ్రద్ధా కపూర్​ వాట్సాప్​ చాట్​ వైరల్​గా మారింది. అయితే ఆమె ఎవరితో చాట్​ చేసిందనేది తెలియాల్సి ఉంది.

shradda, shradha kapoor image
శ్రద్ధా కపూర్
author img

By

Published : Jul 31, 2021, 9:02 PM IST

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ వాట్సాప్​ చాట్ వైరల్​గా మారింది. ఇటీవలే ముంబయి స్టూడియో నుంచి శ్రద్ధా బయటికి వస్తుండగా ఓ ఫొటోగ్రాఫర్​ తన ఫొటో తీశాడు. ఆ సమయంలో శ్రద్ధా ఫోన్​లో బిజీగా ఉంది. అయితే.. తన వాట్సాప్​ చాట్ కూడా కనిపించేలా ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు ఫొటోగ్రాఫర్.

"ముంబయిలో షూటింగ్​ ముగించుకుని బయటకు వచ్చాక శ్రద్ధా.. ఫోన్​లో చూస్తూ చాలా బిజీగా కనిపించింది. లవ్​ ఎమోజీ కాంటాక్ట్​తో చాట్ చేసింది. మరి అతనెవరో తెలియాల్సి ఉంది" అని ఫొటోకు క్యాప్షన్ జోడించాడు.

అయితే.. ఆ వాట్సాప్​ చాట్ నిజమేనా?. లేక ఫొటోషాప్​ చేసిందా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకంటూ వ్యక్తిగత జీవితం ఉంటుందని.. ఈ విధంగా చేయడం సరికాదని మరికొందరు కామెంట్లు చేశారు. "మీపైన ఉన్న నమ్మకంతోనే వారు మిమ్మల్ని దగ్గరకు రానిస్తారు. మీరు ఇలా చేయడం సరికాదు" అని ఓ నెటిజన్​ కామెంట్ చేశాడు.

సినిమాల విషయానికొస్తే.. రణ్​బీర్ కపూర్, లవ్​ రంజన్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రద్ధా నటించనుంది. విశాల్​ ఫురియా చిత్రంలోను ఆమె నాగినిగా కనిపించనుంది.

ఇదీ చదవండి:'శ్రద్ధా.. అతడ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.