బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేడన్న నిజాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని హీరోయిన్ శ్రద్ధా కపూర్ చెప్పింది. అతడితో ఉన్న సందర్భాలను గుర్తుచేసుకుంది. దయ, జాలి, చురుకుదనం, తెలివి, ఉత్సుకత లాంటి సద్గుణాలు సుశాంత్ ఉన్నాయని తెలిపింది. "ది సీక్రెట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జీనియస్" పుస్తకం కవర్పేజితో సహా వీరిద్దరు కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుని, భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
గతేడాది వచ్చిన 'చిచ్చోరే'లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో సుశాంత్ తనతో ఎలా ఉండేవాడో ఆ సందర్భాలను గుర్తుచేసుకుంది శ్రద్ధా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"సుశాంత్ సెట్‌కు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆతురతగా ఎదురుచూసేదాన్ని. ఎందుకంటే అతడి వ్యక్తిత్వం ఎంతో గొప్పది. ఎంత మంచి మనసో అంతే మేధావి కూడా. తన జీవితాన్ని తానే రూపుదిద్దుకున్నాడు. నచ్చిన పని చేసుకుంటూ అందులోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని గడుపుతున్నాడు. షూటింగ్లో ఖాళీగా ఉన్నప్పుడు రకరకాల ఫిలాసఫీలు గురించి మేం మాట్లాడుకునేవాళ్లం. అతడితో గడిపిన ఆ క్షణాలన్నీ అద్భుతం. ప్రస్తుతం సుశాంత్‌ను చాలా మిస్ అవుతున్నాను"
-శ్రద్ధాకపూర్, బాలీవుడ్ హీరోయిన్
ఖగోళశాస్త్రం, సైన్స్, ప్రకృతి అంటే సుశాంత్‌కు ఎంతో ఇష్టమని శ్రద్ధా చెప్పింది. కొత్త విషయాలను తెలుసుకోవడం, వాటి కోసం అనేష్వించడం చేసేవాడని తెలిపింది. తన ఇంట్లో అమర్చుకున్న టెలిస్కోప్ ద్వారా ఆకాశంలోని తారలను, వింతలు విశేషాలను, అతడు పొందిన అనుభూతులను అందరితో ఎప్పుడూ పంచుకునేవాడని వెల్లడించింది. ముఖ్యంగా సుశాంత్‌లో ఓ గొప్ప కవి, గాయకుడు ఉన్నాడని వివరించింది.
ఇది చూడండి :
సుశాంత్ మృతిపై ఏక్తా: ఎప్పటికైనా గెలిచేది నిజమే