తన గురించి తాను తెలుసుకునేందుకు లాక్డౌన్ బాగా ఉపయోగపడిందని చెప్పింది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్. అది తన జీవితంలో కీలక ఘట్టమని తెలిపింది. ముఖ్యంగా జీరో(0)కు కొత్త అర్థాన్ని తెలుసుకున్నట్లు వెల్లడించింది.
"లాక్డౌన్లో నన్ను నన్నుగా ప్రేమించడం, కుటుంబం విలువ, నా భావోద్వేగాలు, మానసిక ఆరోగ్యం.. ఇలా ఎన్నో విషయాల ప్రాముఖ్యతను తెలుసుకున్నాను. నా మెదడు మరింత మెరుగ్గా పనిచేసేలా యోగా మీద బాగా దృష్టి పెట్టాను. దీని ద్వారా సినిమా ఎంపిక విషయంపై అవగాహన పెరిగింది. మొత్తంగా నా ఆలోచన పరిధిని పెంచుకున్నాను. జీరో(0)కు కొత్త అర్థాన్ని తెలుసుకున్నాను."
2010లో 'తీన్ పత్తి' సినిమాలో వెండితెర అరంగేట్రం చేసిన శ్రద్ధాకపూర్.. 'లవ్ కా ద ఎండ్' చిత్రంతో తొలిసారి కథానాయికగా పరిచయమైంది. 'ఆషికీ 2'తో స్టార్ హోదా సంపాదించుకుంది. ఆ తర్వాత 'బాఘీ', 'ఏబీసీడీ 2', 'స్త్రీ' చిత్రాలతో ఆకట్టుకుంది. ప్రభాస్ 'సాహో'తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
ఇదీ చూడండి: శ్రద్ధా కపూర్.. అందంతో పాటు అంతకు మించి!