ETV Bharat / sitara

దీపికను అధిగమించిన శ్రద్ధా కపూర్​​ - ఇన్​స్టాగ్రామ్ ఫాలోవర్స్​ టాప్​-3లో శ్రద్ధా కపూర్​

ఇన్​స్టాలో ఫాలోవర్ల అత్యధికంగా ఉన్న ప్రముఖుల్లో దీపికా పదుకొణె నాలుగో స్థానానికి పడిపోయింది. ఆమె ప్లేస్​ను శ్రద్ధా కపూర్ ఆక్రమించింది.

Shraddha Kapoor BEATS Deepika Padukone in social media following
దీపికను వెనక్కునెట్టి మూడో స్థానానికి చేరిన శ్రద్ధా కపూర్​​
author img

By

Published : Nov 5, 2020, 5:27 PM IST

బాలీవుడ్​ హీరోయిన్ శ్రద్ధా కపూర్ మరో ఘనత సాధించింది. ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన సెలబ్రిటీల్లో మూడో స్థానానికి ఎగబాకింది. ఈ క్రమంలో నటి దీపికా పదుకొణెను వెనక్కు నెట్టింది.

టాప్​-3 సెలబ్రిటీలు

ఇన్​స్టా​లో ఎక్కువ ఫాలోవర్స్​ ఉన్న భారతీయ ప్రముఖుల్లో టీమ్​ఇండియా కెప్టెన్​​ కోహ్లీ 82.2 మిలియన్ల మందితో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా జోనస్​(58.1 మిలియన్లు), శ్రద్ధా కపూర్(56.4 మిలియన్లు), దీపికా పదుకొణె(52.3 మిలియన్లు) ఉన్నారు. ​

బాలీవుడ్​ ప్రముఖులు

వీరి తర్వాతి స్థానాల్లోని బాలీవుడ్​ ప్రముఖుల్లో అలియా భట్​ (50.1 మిలియన్లు), నేహా కక్కర్​ (48.2 మిలియన్లు), అక్షయ్​ కుమార్​ (46.8 మిలియన్లు), జాక్వెలిన్​ ఫెర్నాండెజ్​ (46.2 మిలియన్లు), కత్రినా కైఫ్​ (44.8 మిలియన్లు) ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇన్​స్టాలో 49.7 మిలియన్ల అనుచరులు ఉండటం విశేషం.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.