బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతూ గ్లోబల్‌స్టార్‌గా ప్రేక్షకులను అలరిస్తున్నారు నటి ప్రియాంకా చోప్రా. ఇటీవల విడుదలైన 'వైట్ టైగర్'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓ ఆంగ్ల పత్రికతో సరదాగా ముచ్చటించారు.
![priyanka chopra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10443574_rj-1.jpg)
'నా తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యను అభ్యసించినవారే. నేను కూడా చదువుల్లో రాణించి.. ఇంజినీర్‌గా మారాలని భావించా. కానీ అనూహ్యంగా నా అడుగులు సినిమా ఇండస్ట్రీ వైపు పడ్డాయి. అందాలపోటీలో భాగమైన నేను 2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకున్నాను. ఆ సమయంలోనే భారత్ నుంచి ఎన్నో సినిమా అవకాశాలు వచ్చాయి. సినిమా గురించి నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఒకరకంగా చెప్పాలంటే నటనకు సంబంధించిన చాలా విషయాలను చిత్రీకరణ సమయాల్లోనే నేర్చుకున్నాను. సినీ పరిశ్రమ నాకు చక్కగా నప్పుతుందని ఆ తర్వాత నేను అర్థం చేసుకున్నా'
-ప్రియాంక చోప్రా, హీరోయిన్.
లాక్‌డౌన్ అనంతరం సినిమా చిత్రీకరణల్లో పాల్గొనడం గురించి స్పందిస్తూ.. 'లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా చిత్రీకరణ జరిగే లొకేషన్స్‌లో అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ చిత్రీకరణ జరిగే లొకేషన్స్‌ను నేను సేఫ్‌గా భావించలేకపోయాను' అని ప్రియాంక వివరించారు.
![priyanka chopra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10443574_rj-2.jpg)
ఇదీ చూడండి : 'వాటికి ప్రచారం చేసినందుకు బాధగా ఉంది'