ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan Movie). ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు చిత్రబృందం ప్రకటించింది. చారిత్రక కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది.
అయితే.. మొదటి భాగాన్ని 'పీఎస్ 1'(Ponniyin Selvan Movie) పేరుతో 2022 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఓ పోస్టర్‌ను కూడా విడుదలచేసింది. 2019 డిసెంబర్‌లో థాయ్‌లాండ్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా కొంతకాలం పాటు చిత్రీకరణ వాయిదా పడింది.
మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్యారాయ్ బచ్చన్, విక్రమ్, త్రిష, జయం రవి, కార్తీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
జయరామ్, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రకాశ్‌రాజ్, ప్రభు, ఐశ్వర్య లక్ష్మి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ఇదీ చదవండి: 'పొన్నియిన్ సెల్వన్'లో విక్రమ్, ఐశ్వర్య పాత్రలు ఇవేనా?