ETV Bharat / sitara

'అంధాదున్​' తెలుగు రీమేక్​లో శిల్పాశెట్టి!

author img

By

Published : Jun 9, 2020, 11:17 PM IST

Updated : Jun 10, 2020, 6:32 AM IST

'అంధాదున్​' తెలుగు రీమేక్​లో టబు పాత్ర కోసం బాలీవుడ్​ నటి శిల్పాశెట్టిని చిత్రబృందం సంప్రదించిందట. అయితే ఈ పాత్రలో నటించడానికి ఆమె ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని.. ఈ నేపథ్యంలో రీమేక్ చిత్రంలో శిల్పాశెట్టి మెరవడం లాంఛనమేనని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

Shilpa shetty will star in the Telugu remake of Andhadun
'అంధాదున్​' తెలుగు రీమేక్​లో శిల్పాశెట్టి!

బాలీవుడ్​ సూపర్​హిట్​ మూవీ 'అంధాదున్' తెలుగు రీమేక్​లో యువ కథానాయకుడు నితిన్​ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ప్రియాంక అరుల్​ మోహన్​ హీరోయిన్​. మాతృకలో సీనియర్​ నటి టబు నటించి మెప్పించింది. అయితే తెలుగులో ఆ పాత్రలో మళ్లీ నటించడానికి ఆసక్తి చూపకపోవడం వల్ల​ బాలీవుడ్ నటి శిల్పాశెట్టిని చిత్రబృందం సంప్రదించిందని సమాచారం.

అయితే ఈ చిత్రంలో నటించడానికి శిల్ప ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ, అనసూయ పేర్లను పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. శిల్పాశెట్టి ప్రస్తుతం 'హంగామా2' చిత్రంలో పరేష్‌ రావల్‌తో కలిసి నటిస్తోంది.

ఇదీ చూడండి... శిల్పాశెట్టి: అమ్మగా ఫుల్​టైమ్​..​ ప్రొఫెషనల్​గా పార్ట్​టైమ్

Last Updated : Jun 10, 2020, 6:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.