ETV Bharat / sitara

రాజ్​కుంద్రా పోర్న్​కేసుపై శిల్పాశెట్టి భావోద్వేగం

తన భర్త రాజ్​కుంద్రా పోర్న్​ చిత్రాల కేసు విషయమై తప్పుడు ఆరోపణలు చేయొద్దని నటి శిల్పాశెట్టి కోరింది. తన కుటుంబ గోపత్యను గౌరవించాలని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై ఆసక్తి కాస్త మానుకోవాలని సూచించింది.

author img

By

Published : Aug 2, 2021, 2:42 PM IST

shilpa
శిల్పాశెట్టి

అశ్లీల చిత్రాల దందా కేసులో అరెస్ట్​ అయిన పారిశ్రామికవేత్త రాజ్​కుంద్రా భార్య, నటి శిల్పాశెట్టి భావోద్వేగానికి గురైంది. తన కుటుంబ గోప్యతను గౌరవించాలని, నిజనిజాలేంటో ధ్రువీకరించకుండా సగం సగం సమాచారంపై వ్యాఖ్యానించడం మానుకోవాలని అభ్యర్థించింది. మీడియా తమ కేసుపై విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది.

"గత కొన్ని రోజులుగా సవాళ్లు కొనసాగుతున్నాయి. చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి. మీడియా, శ్రయోభిలాషులు కూడా మాపై ఎన్నో నెగటివ్​ కామెంట్లు చేశారు. దయచేసి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యప్తు కొనసాగుతోంది. ముంబయి పోలీసులు, భారతీయ న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఓ భారతీయ పౌరురాలిగా మన చట్టంపై నాకు గౌరవం ఉంది. 29ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాను. కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. ప్రజలు నాపై విశ్వాసం ఉంచారు. నేను ఎవరినీ నిరాశపర్చలేదు. కాబట్టి ఈ కాలంలో నా పిల్లలు, కుటుంబ గోప్యతను గౌరవించాలని కోరుతున్నా. మేం మీడియా విచారణకు అర్హులం కాదు. చట్టం తన పనిన తాను చేసుకుపోతుంది. సత్యమేవ జయతే"

-శిల్పాశెట్టి, నటి.

అశ్లీల చిత్రాల వ్యాపారం కేసులో ముంబయి పోలీసులు జులై 19న రాజ్‌కుంద్రాను అరెస్ట్‌ చేశారు. అశ్లీల చిత్రాలను నిర్మించి పలు యాప్‌ల ద్వారా వాటిని విడుదల చేస్తున్నారని తెలిసి గత ఫిబ్రవరిలో ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దీనిపై దర్యాప్తు ప్రారంభించిన అధికారులు సాక్ష్యాలను సేకరించి ఇటీవల కుంద్రాను అదుపులోకి తీసుకున్నారు. విస్తుపోయే నిజాలను బయటపెట్టారు.

ఇవీ చూడండి:

సింగపూర్​ నుంచి రాజ్​కుంద్రా ఖాతాలకు భారీగా నగదు బదిలీ!

'మరదల్ని లీడ్‌గా పెట్టి.. కొత్త యాప్‌ ప్రారంభించాలనుకుంటే..'

RajKundra news: కుంద్రా కేసులో 'శిల్పాశెట్టి' పాత్ర ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.