ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 89 ఏళ్ల వయస్సున్న ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ఉదయం 6 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.
సాయంత్రం సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని శ్మశాన వాటికలో శేషయ్య అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు శేఖర్ కమ్ముల కుటుంబసభ్యులు తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయిపల్లవి నటిస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని కమ్ముల శేషయ్య క్లాప్ కొట్టి లాంఛనంగా ప్రారంభించారు. తండ్రి మరణంతో శేఖర్ కమ్ముల తీవ్ర విషాదంలో మునిగిపోయారు.