వైద్య చికిత్స కోసం తాను కొంత కాలం తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. ఈ నేపథ్యంలో ఆయనకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చిందని వార్తలు వచ్చాయి. త్వరలో మెరుగైన చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో సంజయ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పలువురు ప్రముఖులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని తాజాగా ట్విట్టర్లో స్పందించారు నటుడు, కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా.
-
great #SunilDutt. Hope,wish & pray Sanju for your smooth & fast recovery. God Bless! Love & profound regards to the family. pic.twitter.com/uRdNdcazlw
— Shatrughan Sinha (@ShatruganSinha) August 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">great #SunilDutt. Hope,wish & pray Sanju for your smooth & fast recovery. God Bless! Love & profound regards to the family. pic.twitter.com/uRdNdcazlw
— Shatrughan Sinha (@ShatruganSinha) August 13, 2020great #SunilDutt. Hope,wish & pray Sanju for your smooth & fast recovery. God Bless! Love & profound regards to the family. pic.twitter.com/uRdNdcazlw
— Shatrughan Sinha (@ShatruganSinha) August 13, 2020
"దేశం మొత్తం అభిమానించే నటుడు, పార్లమెంటేరియన్, సామాజిక కార్యకర్త, నిజమైన గొప్ప దేశభక్తుడైన సునీల్ దత్ కుమారుడు సంజయ్ దత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మళ్లీ విజేతగా తిరిగి వస్తాడని బలంగా నమ్ముతున్నా. ఆయన కుటుంబంపై దేవుని అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా".
- శత్రుఘ్న సిన్హా, నటుడు, కేంద్ర మాజీమంత్రి
గతవారం శ్వాస సంబంధిత సమస్య రావడం వల్ల ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరాడు సంజయ్ దత్. కరోనా అనుమానంతో పరీక్ష చేయగా అందులో నెగిటివ్గా నిర్ధరణ అయ్యింది. ఆస్పత్రిలో రెండు రోజుల వైద్య పర్యవేక్షణ తర్వాత సోమవారం డిశ్చార్జ్ అయ్యాడు.
సంజయ్ దత్ నటించిన 'సడక్ 2', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం 'కేజీఎఫ్ 2', 'షంషేర్' చిత్రాల్లో నటిస్తున్నాడు.