ETV Bharat / sitara

శర్వానంద్ 'శ్రీకారం' కూడా ఓటీటీలోనే! - Sharwanand latest news

దేశంలోని థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. దీంతో సినిమాలు ఓటీటీ బాటపడుతున్నాయి. ఇప్పుడు శర్వానంద్ 'శ్రీకారం' చిత్రాన్ని ఇందులో తీసుకురావాలని భావిస్తున్నారు.

Sharwanand 'Sreekaram' all set for direct OTT release?
శర్వానంద్ 'శ్రీకారం'
author img

By

Published : Sep 21, 2020, 10:33 PM IST

మరో టాలీవుడ్​ సినిమా ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. యువకథానాయకుడు శర్వానంద్ నటించిన 'శ్రీకారం' త్వరలో డిజిటల్​ వేదికగా విడుదల చేయనున్నారట. ఇందులో శర్వా రైతుగా కనిపించనున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్. సాయికుమార్‌, మురళి శర్మ, రావు రమేష్‌, ఆమని, సప్తగిరి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

కొంతభాగం షూటింగ్​ను అక్టోబరులో పూర్తి చేసి నవంబరు చివర్లో ప్రేక్షకులు ముందు సినిమాను తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. కిశోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. 14 రీల్స్ ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.