టాలీవుడ్ యువ హీరో శర్వానంద్‌కు `96` చిత్ర షూటింగ్‌లో గాయాలయ్యాయి. చిత్రీకరణలో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. శిక్షకుల ఆధ్వర్యంలో శర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేసినప్పటికీ సేఫ్‌గా ల్యాండ్ అవ్వలేకపోయాడు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా దిగినా... ఐదోసారి గాలి ఎక్కువగా వీచినందున ల్యాండింగ్ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫలితంగా కాళ్లపై కిందకి దిగాల్సిన వ్యక్తి భుజాలను మోపి ల్యాండ్ అయ్యాడు.
ఈ ఘటన తర్వాత శర్వానంద్ వెంటనే థాయ్‌లాండ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నాడు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. శర్వాకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు భుజానికి బలమైన గాయం తగలిందని, శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం ఈ శస్రచికిత్స జరగనుంది. అనంతరం కనీసం నాలుగు రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని శర్వానంద్‌కు సూచించారు వైద్యులు.