శర్వానంద్-రష్మిక కలిసి త్వరలో ఓ సినిమా కోసం కలిసి పనిచేయనున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించనున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శర్వానంద్, రష్మికతోపాటు ఇతర చిత్రబృందం తిరుమల శ్రీవారి సేవలో పాల్గొంది.
శర్వానంద్ ప్రస్తుతం 'శ్రీకారం' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కిషోర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వాకి జంటగా ప్రియాంక అరుల్ మోహన్ సందడి చేయనున్నారు. ఇటీవల 'శ్రీకారం' షూటింగ్ తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగింది.