ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్ర షూటింగ్ తుది దశలు చేరుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఆస్ట్రియాలో జరపుకుంటోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాలో పంచుకున్నాడు మన డార్లింగ్. ఆగస్టు 15న సాహో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"హాయ్ డార్లింగ్స్.. ఆస్ట్రియాలో సాహో షూటింగ్ జరుగుతోంది. అద్భుతంగా ఉంది. ఇంత వరకు చూడని అనుభూతులను కలిగిస్తోంది" అంటూ తన ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు రెబల్ స్టార్.
సాహో సినిమాలో ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాహో చిత్ర టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: ఇ'స్మార్ట్'గా షూటింగ్ పూర్తిచేసుకున్న శంకర్