ETV Bharat / sitara

మెగాస్టార్ 'జెంటిల్​మేన్' కావాల్సింది.. ప్చ్​ కుదర్లేదు - జెంటిల్​మెన్ వార్తలు

శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా తెరకెక్కి బ్లాక్​బస్టర్​గా నిలిచిన చిత్రం 'జెంటిల్​మేన్'. అయితే ఈ సినిమాలో ముందుగా చిరంజీవిని హీరోగా అనుకున్నాడట దర్శకుడు శంకర్.

Shankar first approach chiranjeevi for Gentleman
చిరంజీవి
author img

By

Published : Jun 29, 2020, 5:24 AM IST

'జెంటిల్‌మేన్‌' చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఓ సంచలనం సృష్టించింది. అర్జున్‌.. కృష్ణమూర్తి పాత్రలో తన సత్తా చాటాడు. మరి అర్జున్‌ స్థానంలో చిరంజీవి అయితే ఎలా ఉండేదో కదా! కానీ ఆ అదృష్టం అర్జున్​ను వరించడం సినిమా బ్లాక్​బస్టర్​గా నిలవడం అంతా తెలిసిందే.

అయితే ఈ చిత్ర దర్శకుడు శంకర్‌ ముందుగా ఈ కథ కోసం చిరంజీవినే అనుకున్నాడట. ఈ మేరకు చిరును సంప్రదించాడని అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పటికే చిరు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం, శంకర్‌ నూతన దర్శకుడు కావడం వల్ల ఆలోచించారట మెగాస్టార్. తర్వాత సున్నితంగా ఈ చిత్రానికి నో చెప్పారు. దాంతో అర్జున్‌ను ఎంపిక చేసుకున్నాడు శంకర్‌. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాడు. అలా చిరు వదులుకున్న సినిమాలో నటించి అర్జున్‌ అదరగొట్టాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.