'నిశ్శబ్దం' సినిమాలోని ఒక్కో పాత్ర లుక్‌ను ఒక్కోసారి విడుదల చేస్తోంది చిత్రబృందం. షాలినీ పాండే తొలిరూపును సోమవారం ప్రేక్షకులతో పంచుకుంది. సోనాలి(వాయిస్ ఆఫ్ సాక్షి) అనే పాత్రలో కనిపించనుందీ భామ. దివ్యాంగ కళాకారిణి అయిన అనుష్కకు సహాయపడే పాత్రలో నటిస్తోంది.

ఇటీవలే 'నిశ్శబ్దం' టీజర్‌ను విడుదల చేశారు. అంచనాలు పెంచుతూ అలరిస్తోంది. ఈ సినిమాలో మాధవన్, మైఖేల్ మ్యాడిసన్, సుబ్బరాజ్, అంజలి, షాలినీ పాండే తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతమందిస్తున్నాడు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కోనవెంకట్-టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: నిశ్శబ్దం టీజర్: నిశ్శబ్దాన్ని ఛేదించే ఆ నిజం ఏంటి?