సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'శాకుంతలం'. మహాభారతం ఆదిపర్వంలోని శాకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా రూపొందుతోంది. టైటిల్ పాత్రని సమంత పోషిస్తుండగా మలయాళ నటుడు దేవ్ మోహన దుష్యంతుడిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రానుంది. అయితే అధికారికంగా ప్రకటించకపోయినా ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ విలక్షణ నటుడు కబీర్ బేడీ నటిస్తున్నట్టు హింట్ ఇచ్చారు నిర్మాత నీలిమ గుణ. తాను రాసిన 'స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ ఏన్ యాక్టర్' పుస్తకాన్ని నీలిమకు ఇటీవల అందించారు కబీర్.
'థ్యాంక్ యు కబీర్ సర్. మీతో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పుస్తకాన్ని చదవకుండా ఉండలేను'అని ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు నీలిమ. దాంతోపాటు శాకుంతలం హ్యాష్‌ట్యాగ్ జతచేసి, ఈ చిత్రంలో కబీర్ నటిస్తున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. హిందీ, తమిళ చిత్రాలతోపాటు ఇటాలియన్ చిత్రాల్లోనూ నటించి, మెప్పించారు కబీర్.
నాట్యం పాట విడుదల..
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నాట్యం. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలోని నమఃశివాయ అంటూ సాగే పాటను నందమూరి బాలకృష్ణ లాంఛనంగా విడుదల చేశారు. జగద్గురు ఆది శంకరాచార్యులు రచించిన ఈ పాటకు శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని అందించగా.. లలిత, కాలభైరవ ఈ పాటను ఆలపించారు. నమఃశివాయ పాట చాలా బాగుందని, తన నియోజకవర్గ పరిధిలోని లేపాక్షిలో ఈ పాటను చిత్రీకరించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ తెలిపారు. నాట్యంలో నటించిన సంధ్యారాజ్, కమల్ కామరాజుకు అభినందనలు తెలిపిన బాలకృష్ణ.. బహుముఖ ప్రజ్ఞాశాలిగా నాట్యం చిత్రం కోసం పనిచేసిన దర్శకుడు రేవంత్‌ను బాలకృష్ణ ప్రత్యేకంగా ప్రశంసించారు.
మొక్కలు నాటండి..
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తన పుట్టినరోజు ఆగస్టు 9 సందర్భంగా అభిమానులందరూ మొక్కలు నాటాలని సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపు నిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి అభిమాని 3 మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేశ్ బాబు కోరారు. నాటిన మొక్కలతో ఫొటోలు తీసి తనకు ట్యాగ్ చేయాలని సూచించిన మహేశ్.. వాటన్నింటిని తాను స్వయంగా చూస్తానని ప్రకటించారు. మహేశ్ బాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహేశ్ బాబు అభిమానులు మొక్కలు నాటి ఆదర్శంగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు అదే రోజు మహేశ్ నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రచార చిత్రం విడుదల కానుంది.
ఆకట్టుకుంటున్న దుర్గ పోస్టర్..
-
.@offl_Lawrence 's #RagavendraProductions next is Titled #Durga #RaghavaLawrence pic.twitter.com/YKKXx68CIl
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@offl_Lawrence 's #RagavendraProductions next is Titled #Durga #RaghavaLawrence pic.twitter.com/YKKXx68CIl
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021.@offl_Lawrence 's #RagavendraProductions next is Titled #Durga #RaghavaLawrence pic.twitter.com/YKKXx68CIl
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021
రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం దుర్గ. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
మంచువారింట్లో మోహన్‌లాల్..
-
.@Mohanlal met @themohanbabu & Family in Hyderabad@iVishnuManchu @LakshmiManchu pic.twitter.com/BOKfoa4CC3
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">.@Mohanlal met @themohanbabu & Family in Hyderabad@iVishnuManchu @LakshmiManchu pic.twitter.com/BOKfoa4CC3
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021.@Mohanlal met @themohanbabu & Family in Hyderabad@iVishnuManchu @LakshmiManchu pic.twitter.com/BOKfoa4CC3
— BARaju's Team (@baraju_SuperHit) August 6, 2021
మలయాళీ ప్రముఖ నటుడు మోహన్‌లాల్.. తెలుగు నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో సందడి చేశారు. మంచు కుటుంబంతో కలిసి మోహన్‌లాల్ భోజనం చేశారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మంచు లక్ష్మి.
గాయకుడిగా మారిన బాలీవుడ్ హీరో..
కండలు తిరిగిన దేహంతో పోరాటాలు, అదిరిపోయే డ్యాన్స్‌లు, అబ్బురపరిచే ఫీట్స్‌తో అలరిస్తుంటాడు బాలీవుడ్ యువ కథానాయకుడు టైగర్ ష్రాఫ్. కేవలం నటన, ఫిట్‌నెస్‌కి మాత్రమే పరిమితమైపోలేదు ఈ 31ఏళ్ల నటుడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గాయకుడిగా మారి తన స్వరాన్ని వినిపించనున్నాడు. 'వందేమాతరం' అనే పాటతో మ్యూజిక్ వీడియోను రూపొందించి దేశానికి కానుకగా ఇవ్వనున్నాడు. ఇదే విషయాన్ని శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.
'జీవితంలో ఇలాంటి పాట పాడటం ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది.. కాస్త భయంగానూ ఉంది. 'వందేమాతరం' అనేది కేవలం పాట మాత్రమే కాదు. ఒక ఎమోషన్. ఇలాంటి ప్రత్యేక పాటను పాడి దేశానికి అంకితమివ్వడం, మీతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ఆగస్టు10 (మంగళవారం) ఈ మ్యూజిక్ వీడియోని విడుదల చేయబుతున్నాం'అని పోస్టు చేశారు.
దీనికి రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తుండగా.. విశాల్ మిశ్రా సంగీతాన్ని సమకూరుస్తున్నారు, కౌశల్ కిశోర్ సాహిత్యాన్ని అందించారు.
ఇదీ చదవండి: 'హే రంభ' ఐటంసాంగ్.. 'మాస్ట్రో' వీడియో సాంగ్