బాలీవుడ్ నటి విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'శకుంతలా దేవి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో హ్యూమన్ కంప్యూటర్ పాత్రలో కనిపించిన బాలన్.. తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటోంది. ట్రైలర్లో విద్యాబాలన్‌ను నిమిషాల్లోనే అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను పరిష్కరించగల సామర్థ్యం ఉన్న ఓ గణిత శాస్త్రవేత్తగా చూపించారు. తన నైపుణ్యంతో గిన్నిస్ రికార్డులో పేరు నమోదు చేసుకోవడమే కాక.. ఒకానొక సమయంలో కప్యూటర్ గణాంకాలనే తప్పుగా చూపిస్తూ శకుంతలా దేవి అదరకొట్టింది. ఆమె జీవితాధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ సినిమాలో జిషు సేన్‌గుప్తా.. విద్యాబాలన్‌కు జోడీగా నటించగా.. దంగల్ హీరోయిన్ సన్యా మల్హోత్రా కుమార్తెగా కనిపించింది. తల్లీకూతుర్ల మధ్య సన్నివేశాలు మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు ట్రైలర్లో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో 'కైపోచే' నటుడు అమిత్ సాధ్ కీలక పాత్రలో నటించాడు. అను మేనన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా జులై 31న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.