బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్‌పై(Sharukh Khan) ప్రశంసలు కురిపించింది నటి ప్రియమణి(Priyamani). బాద్షా మంచి వ్యక్తిత్వమున్న వ్యక్తి అని చెప్పింది. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2'(The Family man2) వెబ్‌సిరీస్ విడుదలై విజయం సాధించిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. షారుక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'చెన్నై ఎక్స్‌ప్రెస్'(Chennai Express) సినిమాలో ఆయనతో కలిసి ఓ స్పెషల్ సాంగ్‌లో ప్రియమణి చిందేసింది. ఆ సమయంలో షారుక్ తనకు రూ.300 ఇచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకుంది.
"ఈ పాట షూటింగ్ ఐదు రాత్రుల పాటు జరిగింది. అదో గొప్ప అనుభవం. షారుక్ సూపర్‌స్టార్ అయినా సరే చాలా సింపుల్‌గా ఉంటారు. అస్సలు గర్వం ఉండదు. ఎంతో మంచి వ్యక్తి. తన చుట్టూ ఉన్న వాళ్లను బాగా చూసుకుంటారు. వాళ్లతో చాలా చక్కగా కలిసిపోతారు. అందుకే ఆయన్ను అందరూ ప్రేమిస్తారు. నేను షూటింగ్‌ను వెళ్లి రోజు నుంచి అయిపోయేవరకు మమల్ని చాలా బాగా చూసుకున్నారు. నేను చాలా సౌకర్యవంతంగా ఫీలయ్యాను. ఈ క్రమంలోనే మేమిద్దరం ఐప్యాడ్‌లో కౌన్ బనేగా కరోడ్‌పతి గేమ్ ఆడాం. అందులో గెలిచినందుకు ఆయన నాకు రూ.300 రూపాయలు ఇచ్చారు. అవి ఇప్పటికీ నా దగ్గరనే ఉన్నాయి"
-ప్రియమణి, నటి
'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్ తొలి సీజన్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియమణి.. ఇటీవల 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌తో మరోసారి అలరిస్తోంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలో 'విరాటపర్వం'(Virataparvam), 'నారప్ప'(Narappa), 'మైదాన్'(హిందీ), కన్నడలో 'సైనైడ్', 'డాక్టర్ 56', 'ఖైమారా', కొటేషన్ గ్యాంగ్(తమిళం) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది..
మరోవైపు షారుక్.. 'పఠాన్' సినిమాతో బిజీగా ఉన్నారు. కరోనా కారణంగా తాత్కాలికంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇందులో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ తెరపై ఇప్పటివరకూ చూడని యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ఉండనున్నాయని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ పోరాట సన్నివేశాల కోసం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్.. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్లు కేజీ ఓ నెయిల్, డొమోంకోస్ పర్ణానీలు రంగంలోకి దించారు. 2022లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.
ఇదీ చూడండి: క్వారంటైన్లోకి షారుక్.. 'పఠాన్' షూటింగ్ వాయిదా!