షాహిద్ కపూర్ హీరోగా నటించిన 'కబీర్ సింగ్' 200 కోట్ల క్లబ్ దాటి 300 కోట్ల దిశగా అడుగులేస్తోంది. ఓవర్ నైట్ లో పెద్ద హిట్ అందుకున్న ఈ హీరో.. పారితోషికం విషయంలో తగ్గేది లేదంటున్నాడు. కబీర్ సింగ్ విడుదలకు ముందు ఓ చిత్రానికి 15 కోట్లు అందుకున్న షాహిద్.. ప్రస్తుతం 35 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం.
తనతో సినిమా తీయాలనుకునే దర్శక, నిర్మాతలకు ఈ విషయాన్ని ముందే చెప్పేస్తున్నాడట షాహిద్. బాలీవుడ్ లో ఇంతవరకు ఈ స్థాయి విజయాన్ని అందుకోలేదు ఈ హీరో. తొలిసారి వంద కోట్ల క్లబ్లో చేరిన షాహిద్.. కబీర్‌సింగ్ విజయంతో వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
'అర్జున్ రెడ్డి' సినిమానే తమిళంలో 'ఆదిత్య వర్మ' గా తీస్తున్నారు. ఇందులో హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.
ఇది చదవండి: WC19: టాస్ గెలిస్తే బ్యాటింగ్‌కే ఓటు..!