షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి(shahid kapoor vijay sethupathi series) ప్రధాన పాత్రల్లో ఓ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. 'ఫ్యామిలీమెన్' దర్శకులు రాజ్ నిడమోరు, కృష్ణ డికె సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు(raj dk vijay sethupathi). ఇది త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఈ సిరీస్‌కు 'సన్నీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కొన్నాళ్లుగా ప్రచారం వినిపిస్తోంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సిరీస్‌కు 'ఫేక్స్' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
రాజ్ - డికె గతంలో ఈ కథను 'ఫర్జీ' అనే పేరుతో షాహిద్, నవాజుద్దీన్ సిద్ధిఖీలతో చేయాలనుకున్నారు. ఇప్పుడా కథలోని నవాజుద్దీన్ చేయాల్సిన పాత్రనే విజయ్ సేతుపతి పోషిస్తున్నారు(vijay sethupathi upcoming web series). ప్రస్తుతం శరవేగంగా ముస్తాబవుతున్న ఈ సిరీస్.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి: హీరో కంటే సేతుపతికే ఎక్కువ రెమ్యునరేషన్!