ETV Bharat / sitara

డీడీఎల్​జే@25: ప్రేమికులంటే గుర్తొచ్చేది షారుక్​, కాజోల్! - దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే

జనరేషన్లతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రవిశేషాలపై ప్రత్యేక కథనం.

DDLJ
డీడీఎల్​జే
author img

By

Published : Oct 20, 2020, 5:30 AM IST

బాలీవుడ్​లో ఎన్ని క్లాసిక్స్​ వచ్చినా.. 'దిల్​వాలే దుల్హానియా లే జాయేంగే' స్థానం మాత్రం చెక్కు చెరగనిది. 1995 అక్టోబర్​ 20న విడుదలైన ఈ సినిమా.. మంగళవారంతో(అక్టోబరు 20) 25ఏళ్లు పూర్తిచేసుకుంది. తరాలతో సంబంధం లేకుండా దశాబ్దాలుగా ప్రేక్షకులను ఇప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. దృశ్యకావ్యం అంటే అర్థం తెలియనివాళ్లు డీడీఎల్​జే చూసి తెలుసుకోవాలని సినీ విమర్శకులే ఇప్పటికీ చెబుతుంటారు.

వసూళ్లు, రికార్డులు పక్కన పెడితే 90ల్లో కుర్రకారును ఈ సినిమా మార్చేసింది. ఓ రకంగా వెండితెర రొమాన్స్​ను రీ డిఫైన్​ చేసిందని చెప్పుకోవచ్చు. ఆ ఏడాది ఫిల్మ్​ఫేర్​ పురస్కారాలన్నీ దాదాపు ఈ సినిమావే. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు ఇలా ప్రధాన విభాగాలన్నింటిలో అవార్డులు సొంతం చేసుకుంది.

DDLJ
డీడీఎల్​జే

షారుక్​, కాజోల్​లా ఉండాలి

తుజే దేఖాతో యే జానా సనమ్​.. ప్యార్​ హోతా హై దీవానా సనమ్​

రుక్​జా ఓ దిల్​ దివానే.....

న జానే మేరే దిల్​ కో....

ఈ పాటలు వింటే అరే ప్రేమంటే ఇంత సున్నితంగా, తియ్యగా ఉంటుందా.. మనమూ ప్రేమలో పడితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. వీరిద్దరి జోడీ ఆ తరం ప్రేమికులను ఎంతగా ప్రభావితం చేసిదంటే.. ప్రేమికులంటే కాజోల్​, షారుక్​​లా కచ్చితంగా ఇలానే ఉండాలి అనిపించేంతగా చేసింది.

చిరస్థాయిగా నిలిచిపోయాయి

ఈ సినిమాలోని రెండు సన్నివేశాలు అభిమానుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఒక పూల తోట మధ్యలో ఓ యువకుడు వెనుక గిటార్, నెత్తిన టోపి పెట్టుకుని తన ప్రేయసి కోసం పాట అందుకుంటాడు. ‘తుజే దేఖా తో యే జానా సనమ్‌’ అంటూ సాగే ఈ పాటను, ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేము. క్లైమాక్స్​లో వచ్చే రైల్వే స్టేషన్‌ సీన్‌ను కూడా మర్చిపోలేమంతే. చూసే ప్రతీ ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేస్తాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాజోల్‌ను పడేసిన షారుక్​‌.. ఆమె రియాక్షన్‌ అదుర్స్‌!

అయితే సినిమాలోని 'రుక్‌ జావో దిల్‌ దివానే' పాట చివర్లో కాజోల్‌ను షారుక్​ గిరాగిరా తిప్పి వెల్లకిలా వాల్చి ఒక చేయిని ఆమె వీపు వెనుక ఆసరాగా ఉంచి ఇచ్చిన పోజ్‌ ఐకానిక్‌గా నిలిచింది. ఆ పోజ్‌ తర్వాత కాజోల్‌ను షారుక్​ దభేలున కిందపడేస్తే ఆమె ఆశ్చర్యపోతూ చూసే దృశ్యం ఉంటుంది. ఆ సన్నివేశాన్ని ఎన్నో సినిమాల్లో రీక్రియేట్‌ చేశారు. అయితే ఆ ఫోజును తీస్తున్నప్పుడు సెట్‌లో ఓ గమ్మత్తైన సంఘటన జరిగింది.

DDLJ
డీడీఎల్​జే

దర్శకుడు ఆదిత్య చోప్రా.. కాజోల్‌కు తనను కిందపడేసే షాట్‌ గురించి ముందే చెప్పలేదట. ఆమె‌కు చెప్పలేదన్న విషయం షారుక్​‌కు చెప్పలేదట. కిందపడినప్పుడు కాజోల్‌ రియాక్షన్‌ సహజంగా రావడానికే ఆదిత్య అలా చేశారు. యాక్షన్‌ చెప్పగానే షారుక్​‌ ఫోజ్‌ ఇవ్వడం, ఆ తర్వాత కాజోల్‌కు ఆసరాగా ఉంచిన చేయి తీసేసి మామూలుగా వెళ్లిపోవడం, కిందపడ్డ కాజోల్‌ ఏం జరిగిందో అర్థంకాక అయోమయంతో అతడి​ వంక చూడటం జరిగిపోయాయి. షాట్‌ ఓకే అయిన తర్వాత ఆమె‌కు అసలు విషయం చెప్పారు ఆదిత్య. ఆయన చెప్పినట్లుగానే తన రియాక్షన్‌ బాగా రావడం వల్ల ఆనందంగా నవ్వేసింది కాజోల్‌.

ఇదీ చూడండి డీడీఎల్​జే@25: లండన్​లో షారుఖ్​, కాజోల్​ జోడీ కాంస్య విగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.