ETV Bharat / sitara

రూపం మనోహరం... అభినయం అనితర సాధ్యం!

author img

By

Published : May 28, 2020, 5:34 AM IST

Updated : May 28, 2020, 6:48 AM IST

తెలుగు తెరపై తన పేరును శాశ్వతంగా ముద్రించుకుని.. నట సార్వభౌముడిగా.. యుగపురుషుడిగా ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఎన్నో చిత్రాల్లో తన మరపురాని నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన ఎన్టీఆర్​ గురించి ఓ ప్రత్యేక కథనం.

NTR
నందమూరి తారకరామ రావు

మీర్జాపురం రాజా 1946లో ఒకవైపు 'కీలుగుఱ్ఱం' చిత్రాన్ని నిర్మిస్తూనే భార్య కృష్ణవేణి కోరికపై స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో రాజకీయ దృక్పథాలను అనుసంధానిస్తూ 'మనదేశం' పేరుతో మరో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ చిత్రానికి దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌. ఆ సినిమాలో పోలీస్‌ ఇన్​స్పెక్టర్‌ పాత్రకోసం కొత్త నటుడిని అన్వేషిస్తూ నందమూరి తారక రామారావుని ఎంపికచేశారు. షూటింగ్​ సిద్ధమైంది.

ఆ సన్నివేశంలో ఆందోళన చేస్తున్న హీరో నారాయణరావును అరెస్టు చేసేందుకు ఇన్​స్పెక్టర్‌ వస్తాడు. హీరో ఎదురు తిరుగుతాడు. పరిస్థితి అదుపు తప్పుతుంది. లాఠీచార్జీ చేయడం అనివార్యమవుతుంది. దర్శకుడు 'యాక్షన్‌' చెప్పారు. ఎన్టీఆర్‌ తన పాత్రలో జీవించారు. ఆయన చేతిలోని లాఠీకి పూనకం వచ్చింది. అడ్డొచ్చిన వాళ్లను చితకబాదారు. సెట్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దర్శకుడు 'కట్‌...కట్‌' అంటూ బిగ్గరగా అరుస్తున్నారు. 'స్టాప్‌' అంటూ కేకలేశారు. వాతావరణం చల్లబడింది. రామారావుని దర్శకుడు పిలిచారు. "నటించవయ్యా అంటే నరమేధం సృష్టించేలా ఉన్నావే. చూడబ్బాయ్‌. ఇది డ్రామా కాదు. సినిమా. మరీ అంతగా విరుచుకపడి నటించాల్సిన అవసరం లేదు" అంటూ సినిమా సూక్ష్మతను వివరించారు. అదీ మన తారకరాముడికి పనిమీద వుండే నిబద్ధత, అభినివేశం. 'ఇంతవాణ్ని. ఇంతవాణ్నయ్యాను' అంటూ పలికిన తొలి డైలాగు నందమూరి తారక రామారావును నిజంగానే అంతవాణ్నిచేసి అత్యున్నత శిఖరాల మీద కూర్చోబెట్టింది. ఆ అభినవ రాముని జయంతి ఈరోజే (మే 28). ఈ సందర్భంగా ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముని ప్రస్థానం గుర్తు చేసుకుందాం.

తొలిరోజుల్లో నందమూరి..

కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో మే28, 1923న నందమూరి తారక రామారావు జన్మించారు. తండ్రి లక్ష్మయ్య చౌదరి, తల్లి వెంకటరామమ్మ. ఏడేళ్ల వయసులో రామారావుకు రామాయణం, భారతం వంటి పురాణాలు వంటబట్టాయి. బెజవాడ మున్సిపల్‌ హైస్కూలులో చదువు పూర్తిచేసి 1940లో స్థానిక ఎస్‌.ఆర్‌.ఆర్‌ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేరారు ఎన్టీఆర్​. కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ అప్పట్లో తెలుగు విభాగానికి అధిపతిగా వుండేవారు. ఒకసారి కళాశాలలో ప్రదర్శించిన 'రాచమల్లు దౌత్యం' అనే నాటకంలో రామారావు ‘నాయకురాలు నాగమ్మ’ వేషం వేయాల్సి వచ్చింది. అయితే మీసాలు తీయనని విశ్వనాథతో చెప్పి మీసాలతోనే ఆ వేషం వేసి రక్తి కట్టించారు. 1942లో రామారావుకు మేనకోడలు బసవరామ తారకంతో పెళ్లి జరిగింది. 1947లో బి.ఎ. పట్టా పుచ్చుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలు చేశారు ఎన్టీఆర్​. పోలీసు శాఖలో సబ్‌ ఇన్​స్పెక్టర్‌ ఉద్యోగం వచ్చినట్లే వచ్చి చేజారింది.

NTR
ఎన్టీఆర్​

దెహ్రాదూన్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమీషన్డ్‌ ఆఫీసరు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపొచ్చింది. కానీ తండ్రి వద్దనడం వల్ల రామారావు వెళ్లలేదు. బెజవాడలో ఉండగా సారథి స్టూడియో వారు నిర్మించబోయే 'శ్రీమతి' అనే చిత్రం కోసం కొత్త ఆర్టిస్టుల వేట ప్రారంభమైంది. పత్రికా ప్రకటన కూడా ఇచ్చారు. ఈ విషయమై ఎల్‌.వి.ప్రసాద్‌ విజయవాడ వచ్చారు. అప్పుడు రామారావును సుబ్రహ్మణ్యం అనే శ్రేయోభిలాషి దుర్గా కళామందిరంలో 'రైతుబిడ్డ' సినిమా చూస్తున్న ఎల్‌.వి. ప్రసాద్‌ వద్దకు తీసుకెళ్లారు. చూడగానే ప్రసాద్‌కు రామారావును బాగా నచ్చారు. తాను రాజమండ్రి వెళుతున్నానని, మద్రాసుకు వెళ్లగానే కబురు పంపుతానని, స్క్రీన్​ టెస్టుకు రావల్సి ఉంటుందని చెప్పి వెళ్లారు. కొద్దిరోజుల్లోనే మద్రాసు నుంచి రామారావుకు కబురొచ్చింది.

మద్రాసులో అడుగుపెట్టి.

మే 21న రామారావు మద్రాసు వెళ్లి శోభనాచల స్టూడియోలో ఎల్‌.వి. ప్రసాద్‌ను కలుసుకున్నారు. అక్కడ 'ద్రోహి' చిత్రం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు ప్రసాద్‌ మేకప్‌ మ్యాన్‌ మంగయ్యతో రామారావుకు మేకప్‌ వేయించారు. టెస్ట్‌ చేసి, కొన్ని స్టిల్స్‌ తీసి, చిన్న సన్నివేశాన్ని చిత్రీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత కబురు చేస్తానని చెప్పగా.. రామారావు బెజవాడ వచ్చి ‘ఎన్‌.ఎ.టి’ సంస్థ తరఫున నాటకాలు ప్రదర్శించ సాగారు. తమ్ముడు త్రివిక్రమ రావు, అట్లూరి పండరీకాక్షయ్య నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అనంతరం రామారావు మద్రాసు సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష రాసి సబ్‌-రిజిస్ట్రారు ఉద్యోగం సంపాదించారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఉద్యోగం చేస్తుండగా ఎల్‌.వి.ప్రసాద్‌ నుంచి ఉత్తరం వచ్చింది. ‘శ్రీమతి’ చిత్ర నిర్మాణం ఆగిపోయిందని, మీర్జాపురం రాజా నిర్మిస్తున్న 'మనదేశం' చిత్రంలో మంచి పాత్ర ఉందని.. మద్రాసు రమ్మని రాశారు. చేస్తున్న ఉద్యోగాన్ని వదలి రామారావు మద్రాసు వెళ్లారు.

NTR
ఎన్టీఆర్​

'మనదేశం'లో పోలీసు ఇన్​స్పెక్టరు వేషంలో రామారావు మెప్పించారు. ఆ చిత్రం 1949 నవంబరులో విడుదలైంది. తర్వాత బీఏ సుబ్బారావు శోభనాచల సంస్థతో సంయుక్త నిర్మాణంలో 'పల్లెటూరి పిల్ల' సినిమా నిర్మాణం ప్రారంభించి.. జంట హీరోలుగా నాగేశ్వరరావు, ఎన్‌.టి.రామారావును తీసుకున్నారు. సినిమా బాగా ఆడింది. తర్వాత విజయ సంస్థ 'షావుకారు' (1950) చిత్రానికి ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. రామారావు ఆ సినిమాలో హీరోగా నటించారు. ఆ రెండు సినిమాలూ విజయవంతమయ్యాయి. అలా ఈ రెండు సినిమాల్లో రామారావుకు అవకాశాలు రావడానికి ఎల్‌.వి. ప్రసాద్‌ దోహదపడ్డారు.

నందమూరి నట జైత్రయాత్ర

1950లో రామారావు నట జైత్రయాత్ర ప్రారంభమైంది. ఆ యాత్ర నిర్విఘ్నంగా 35 సంవత్సరాలు కొనసాగింది. ఆ సంవత్సరం టి.ఆర్‌.సుందరం నిర్మించిన 'మాయారంభ'లో రామారావు నలకూబరుడు వేషం కట్టారు. అంజలీ దేవి కళావతిగా నటించారు. అదే సంవత్సరం సాధనా సంస్థ అధిపతి సి.వి.రంగనాథ దాసు.. అక్కినేని, ఎన్టీఆర్‌ జంట హీరోలుగా ఎల్‌.వి.ప్రసాద్‌ దర్శకత్వంలో 'సంసారం' సినిమా నిర్మించారు. ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఇక 1951లో రెండు అద్భుత సినిమాల్లో రామారావు నటించారు. అవి విజయా వారి 'పాతాళభైరవి', వాహినీ వారి 'మల్లీశ్వరి'. 'పాతాళభైరవి' చిత్రం అఖండ విజయాన్ని సాధించి 10 కేంద్రాల్లో శతదినోత్సవం, నాలుగు కేంద్రాల్లో రజతోత్సవం జరుపుకొంది. అంతే కాకుండా 200 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. 'మల్లీశ్వరి' చిత్రం గొప్ప కళాఖండంగా పేరుతెచ్చుకొని దేశవిదేశాల్లో క్లాసిక్‌గా అందరి ప్రశంసలు అందుకుంది. అలా ఎన్టీఆర్ జైత్ర యాత్ర కొనసాగింది.

NTR
ఎన్టీఆర్​

సొంత నిర్మాణ సంస్థ ఎన్‌ఏటీ ఆరంభం

1952లో రామారావు 'ఎన్​ఏటీ' పేరిట సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పారు. మొదటి ప్రయత్నంగా తాతినేని ప్రకాశ రావు దర్శకత్వంలో 'పిచ్చి పుల్లయ్య' (1953) చిత్రాన్ని నిర్మించారు. సినిమా గొప్పగా ఆడలేదు. 1954లో యోగానంద్‌ దర్శకత్వంలో మరో సొంత చిత్రం 'తోడుదొంగలు' నిర్మించారు. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు ఉత్తమ ప్రాంతీయ చిత్ర బహుమతి లభించింది. అయితే ఈ సినిమా ఆర్థికంగా విజయాన్ని సాధించలేకపోయింది.

NTR
ఎన్టీఆర్​

'ఇద్దరుపెళ్లాలు'(1954) చిత్రంలో తొలిసారి రామారావు కృష్ణుడి వేషంలో కనిపించారు. విజయ సంస్థ పి.పుల్లయ్య నిర్మించిన 'కన్యాశుల్కం'లో రామారావు నెగిటివ్‌ ఛాయలున్న గిరీశం పాత్రను పోషించి రంజింపజేశారు. సొంత బ్యానర్‌ మీద నిర్మించిన రెండు సాంఘిక చిత్రాలు ఆర్థిక విజయాన్ని సాధించకపోగా.. ఈసారి 'జయసింహ' (1955) పేరుతో తొలి జానపద చిత్రాన్ని నిర్మించారు. సినిమా అద్భుత విజయాన్ని నమోదుచేసి రామారావుకు సొంతబ్యానర్‌ మీద చిత్రాలు నిర్మించేందుకు అవసరమైన ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత నిర్మించిన 'పాండురంగ మహత్యం' అద్భుత విజయాన్ని నమోదుచేసింది. ఇక 'సీతారామ కల్యాణం', 'గులేబకావళి కథ' సినిమాల విజయాల గురించి చెప్పనవసరమే లేదు. 'సీతారామ కల్యాణం' సినిమాకు రామారావే దర్శకత్వం వహించడం విశేషం. అయితే రామారావు టైటిల్స్‌లో తన పేరు వేసుకోలేదు.

మరిన్ని విశేషాలు..

'పాతాళభైరవి' చిత్రంలో తన సహచరుడిగా నటించిన నటుడు బాలకృష్ణ మద్యానికి బానిసై షూటింగులకు ఆలస్యంగా రాగా అతణ్ని చిత్రం నుంచి తప్పించాలని ఒక ప్రముఖ నిర్మాత ప్రయత్నిస్తే, దానివల్ల అతని కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని ఆ ప్రయత్నాన్ని వారించి, బాలకృష్ణను ఇంటికి పిలిచి రామారావు మందలించారు. ఆ తర్వాత బాలకృష్ణ ఏనాడూ షూటింగుకి ఆలస్యంగా రాలేదు. అలా మానవత్వ విలువల్ని కాపాడే వ్యక్తిత్వం మూర్తీభవించిన మనిషి ఈ తారకరాముడు.

సినిమాల్లో మారువేషాలు వేయడం రామారావుకి ఇష్టం. అది జానపదమైనా, సాంఘికమైనా.. ఒకటి లేక రెండు మారువేషాలు ఉండేలా స్క్రిప్టు తయారు చేయాలని రచయితలకు ప్రత్యేకంగా చెప్పేవారు. విజయవాడలోని దుర్గా కళామందిర్‌కి.. రామారావుకు అవినాభావ సంబంధం ఉంది.

రామారావుది క్రమశిక్షణ గల జీవితం. ఉదయం నాలుగు గంటలకే లేచి వ్యాయామం, యోగాసనాలు వేసి, ఉదయం ఆరు గంటలకే భోజనం చేసి... మేకప్‌ చేసుకొని ఆరున్నరకే తయారై కూర్చొని, తన సొంత సినిమాల విషయాలు చూసుకోనేవారు. షూటింగుకి ఏనాడూ ఆలస్యంగా వెళ్లలేదు ఎన్టీఆర్​. నిర్మాతలకు ఏనాడూ తనవల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఇవ్వలేదు.

NTR
ఎన్టీఆర్​

రామారావుకు సొంత కుర్చీ తెచ్చుకోవడం అలవాటు. ఆయనకంటే ముందే సెట్‌లోకి కుర్చీ వచ్చిందటే రామారావు వస్తున్నట్లే. వెంటనే సెట్లో వాళ్లంతా అలర్టై లేచి నిలబడేవారు. తన కుర్చీమీద ఎన్టీఆర్​ పేరు అందంగా కుట్టి ఉండేది. కుర్చీతో పాటు ఒక కంచు మరచెంబు నిండా మంచి నీళ్లు, గ్లాసు, వెండి కంచం వచ్చేవి. అవసరమైతే ఇంటి నుంచి మంచినీళ్ల బిందె కూడా వచ్చేది. మంచి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం రామారావుకు అలవాటు.

ఇదీ చూడండి : టామ్ క్రూజ్ అంతరిక్ష చిత్రానికి దర్శకుడు ఈయనే

Last Updated : May 28, 2020, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.