శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తికావొస్తోంది. ఆయన తర్వాతి చిత్రం ఎప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే శేఖర్ కమ్ముల తదుపరి సినిమా.. హీరో నాగచైతన్యతో చేయబోతున్నాడంట. ఈ విషయాన్ని స్వయంగా చైతన్యే తన ట్విట్టర్లో పంచుకున్నాడు.
-
Someone I’ve been wanting to work with from the time I started my career.Sekar Kammula.and it’s finally happening ! Another beautiful love story true in every way produced by Sunil Narang..shoot starts September 2019 !! Times are good..blessed..thank you for all the support #nc20
— chaitanya akkineni (@chay_akkineni) June 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Someone I’ve been wanting to work with from the time I started my career.Sekar Kammula.and it’s finally happening ! Another beautiful love story true in every way produced by Sunil Narang..shoot starts September 2019 !! Times are good..blessed..thank you for all the support #nc20
— chaitanya akkineni (@chay_akkineni) June 20, 2019Someone I’ve been wanting to work with from the time I started my career.Sekar Kammula.and it’s finally happening ! Another beautiful love story true in every way produced by Sunil Narang..shoot starts September 2019 !! Times are good..blessed..thank you for all the support #nc20
— chaitanya akkineni (@chay_akkineni) June 20, 2019
"హీరోగా నా కెరీర్ను మొదలుపెట్టిన దగ్గరి నుంచి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలనుకున్నా. ఆ కల ఇప్పటికి నెరవేరనుంది. మరో మంచి ప్రేమ కథతో మీ ముందుకు రాబోతున్నాం. సునీల్ నారంగ్ నిర్మించే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబరులో ప్రారంభం కానుంది. సమయం అనుకూలించింది. మీ అందరి మద్దతుకు కృతజ్ఞతలు" - నాగచైతన్య ట్వీట్
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.
ఇది చదవండి: బేబీకి 24 ఏళ్లా.. 70 ఏళ్లా..? ట్రైలర్