ETV Bharat / sitara

దేశద్రోహం కేసు​లో విచారణకు హాజరైన కంగన - బాంద్రా పోలీస్​ స్టేషన్​లో విచారణకు హాజరైన కంగన

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​.. బాంద్రా పోలీసుల ఎదుట హాజరయ్యారు. తనపై నమోదైన దేశద్రోహం కేసుతో పాటు ఇతర ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం విచారణకు వచ్చారు.

Sedition Case: Kangana Ranaut reaches Bandra police station in Mumbai to record statement
దేశద్రోహం కేసు​లో విచారణకు హజరైన కంగన
author img

By

Published : Jan 8, 2021, 1:34 PM IST

Updated : Jan 8, 2021, 2:11 PM IST

దేశద్రోహం కేసులో తన వాంగ్మూలాన్ని సమర్పించడానికి బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ హాజరయ్యారు. ఈ కేసుతో పాటు ఆమెపై ఉన్న ఇతర ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం తన సోదరి రంగోలీతో కలిసి బాంద్రా పోలీసు స్టేషన్​కు చేరారు. ఈ నేపథ్యంలో వై-ప్లస్​ కేటగిరీ భద్రత నడుమ ఆమె విచారణకు వచ్చారు.

బాంద్రా పోలీస్​ స్టేషన్​కు బయలుదేరిన కంగనా రనౌత్

ఏం జరిగిందంటే?

గతేడాది అక్టోబరులో సోషల్​మీడియా వేదికగా విద్వేషాన్ని సృష్టించే పోస్టులు పెట్టారని నటి కంగనా రనౌత్​తో పాటు ఆమె సోదరి రంగోలీపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు బాంద్రా మేజిస్ట్రేట్​ను ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు ఐపీసీ 153-ఏ, 295-ఏ, 124-ఏ, 34 సెక్షన్ల కింద కంగన సిస్టర్స్​పై బాంద్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కంగనా రనౌత్​కు పోలీసులు మూడు సార్లు నోటీసులు పంపినా.. అందుకు ఆమె హాజరు కాలేదు. అయితే ఈ కేసు విచారణలో పాల్గొనేందుకు కొంత సమయం కావాలని నవంబరులో కంగన న్యాయస్థానాన్నిను ఆశ్రయించగా.. ఈ కేసుపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 8న పోలీసుల ఎదుట విచారణకు హాజరై తమ వాంగ్మూలాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఇదీ చూడండి: నేహా శర్మ అందానికి కుర్రకారు బేజారు!

Last Updated : Jan 8, 2021, 2:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.