ETV Bharat / sitara

'తాండవ్'​ ఎఫెక్ట్​.. సైఫ్​ అలీఖాన్​ ఇంటికి భద్రత - బాయ్​కాట్​ తాండవ్​

ఇటీవల ఓటీటీలో విడుదలైన 'తాండవ్​' వెబ్​సిరీస్​పై నిరసనల సెగ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్​ స్టార్​ హీరో సైఫ్​ అలీఖాన్​ నటించిన ఈ సిరీస్​.. దేవుళ్లను అవమానించేలా ఉందని భాజపా ఎమ్మెల్యే రామ్​కదమ్​ ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్​మీడియాలోనూ ఈ వెబ్​సిరీస్​పై వ్యతిరేకత పెరగడం వల్ల ముందు జాగ్రత్తగా సైఫ్​ అలీఖాన్​ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.

Security outside Saif Ali Khan's home as outrage over series grows
'తాండవ్'​ ఎఫెక్ట్​.. సైఫ్​ అలీఖాన్​ ఇంటికి భద్రత
author img

By

Published : Jan 18, 2021, 8:04 AM IST

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటించిన వెబ్‌సిరీస్‌ 'తాండవ్‌'పై నిరసనల సెగ కొనసాగుతూనే ఉంది. దేవుళ్లను అవమానిస్తూ.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా ఆ వెబ్‌సిరీస్‌ ఉందంటూ భాజపా ఎమ్మెల్యే రామ్‌కదమ్‌ ముంబయిలోని ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు ప్రదర్శనను నిలిపివేయాలంటూ భాజపా ఎంపీ మనోజ్‌కుమార్‌ కొటక్‌ కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు లేఖ రాశారు. మరోవైపు వెబ్‌సిరీస్‌పై వ్యతిరేకత పెరగడం వల్ల ముందస్తు జాగ్రత్తగా ముంబయి శివారులో ఉన్న సైఫ్‌ ఇంటివద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

సామాజిక మాధ్యమాల్లోనూ 'బ్యాన్‌ తాండవ్‌', 'బాయ్‌కాట్‌తాండవ్‌' పేరుతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 'తాండవ్‌'లో ఉద్దేశపూర్వంగా దేవుళ్లను ఎగతాళి చేశారని, సెక్స్‌, హింస, మాదకద్రవ్యాలు.. ఇలా అనేక రకాలుగా విద్వేషాలు రెచ్చగొట్టేలా వెబ్‌సిరీస్‌ ఉందని ఎంపీ మనోజ్‌ లేఖలో పేర్కొన్నారు. 'తాండవ్‌'ను డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ తెరకెక్కించారు. డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు. హిమాన్షు కిషన్‌ మెహ్రా నిర్మాత. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రెండుసార్లు పెళ్లి చేసుకుంటా: సోనాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.